వడ్డేపల్లి రాగరామాయణం పుస్తకాన్ని ఎవరు రచించారు?
Sakshi Education
తెలంగాణ సారస్వత పరిషత్తు తొలిసారిగా తెలుగు సాహిత్య ప్రక్రియల్లో నిర్వహించిన గ్రంథ రచన పోటీల ఫలితాలు ఏప్రిల్ 22న ప్రకటించింది.
2021 ఏడాదికి గాను నిర్వహించిన ఈ పోటీలను తెలంగాణ వారికే పరిమితం చేశామని పరిషత్తు అధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి తెలిపారు. తగుళ్ల గోపాల్ రచించిన గ్రంథం... ‘‘దండ కడియం’’ యువ పురస్కారానికి ఎంపికైందని పేర్కొన్నారు.
పురస్కార విజేతలు–వివరాలు
పురస్కార విజేతలు–వివరాలు
పురస్కారానికి ఎంపికైన గ్రంథం | విభాగం | గ్రంథ రచయిత |
విచ్చుకున్న అక్షరం | వచన కవిత్వం | నాగరాజు రామస్వామి |
వడ్డేపల్లి రాగరామాయణం | పద్యగేయ కవిత్వం | డా.వడ్డేపల్లి కృష్ణ |
కథమానం భవతి–నూటొక్క కథలు | కథాప్రక్రియ | కె.వి.నరేందర్ |
కల్లోల కలల కాలం | నవల ప్రక్రియ | పరవస్తు లోకేశ్వర్ |
తెలుగు నవల ప్రయోగ వైవిధ్యం | విమర్శ ప్రక్రియ | కె.పి.అశోక్‌కుమార్ |
ఊరి దస్తూరి | ఇతర విభాగం | అన్నవరం దేవేందర్ |
Published date : 23 Apr 2021 06:28PM