Skip to main content

వైరస్‌లను నిరోధించే ఔషధం మోల్నుపిరావిర్‌ను అభివృద్ధి చేసిన సంస్థ?

అమెరికాలోని ఇమోరీ యూనివర్సిటీకి చెందిన డ్రగ్‌ ఇన్నోవేషన్‌ వెంచర్స్‌ కంపెనీ ‘‘మోల్నుపిరావిర్‌’’ ఔషధాన్ని అభివృద్ధి చేసింది.
Current Affairs మియామీకి చెందిన ‘రిడ్జ్‌బ్యాక్‌ బయోథెరప్యుటిక్స్‌’ ఈ ఔషధంపై హక్కును కైవసం చేసుకుంది. ఈ కంపెనీ మోల్నుపిరావిర్‌ తదుపరి దశ అభివృద్ధి కోసం అమెరికాకే చెందిన మరో కంపెనీ మెర్క్‌తో చేతులు కలిపింది. కోవిడ్‌–19కు సంబంధించి ఈ మందు వినియోగంపై మనుషులపై తొలి, రెండో దశ ప్రయోగ పరీక్షలు అమెరికాలో విజయవంతంగా పూర్తయ్యాయి. మూడో దశ ప్రయోగాల్లోనూ సత్ఫలితాలు వస్తున్నాయని ఏప్రిల్‌ 21న రిడ్జ్‌బ్యాక్‌ పేర్కొంది.

కరోనా చికిత్సలో సత్ఫలితాలు...
వైరస్‌లను నిరోధించే ప్రయోగాత్మక ఔషధం అయిన మోల్నుపిరావిర్‌ 2021 ఏడాదే భారత్‌లోనూ అందుబాటులోకి రానుంది. కరోనా రోగుల చికిత్సలో ఈ మందు సత్ఫలితాలను ఇస్తోందని అమెరికాలో జరిగిన క్లినికల్‌ ట్రయల్స్‌ ద్వారా వెల్లడైంది. ఈ మందు వాడడం మొదలు పెట్టిన రోజు నుంచే సదరు రోగి ద్వారా వేరొకరికి వైరస్‌ వ్యాపించకపోవడం దీని ప్రత్యేకత. వయసుతో నిమిత్తం లేకుండా దీనిని వాడొచ్చు. ప్రస్తుతం ఇన్‌ఫ్లూయంజా వ్యాధి చికిత్సలో ఈ మందును వినియోగిస్తున్నారు.

క్విక్‌ రివ్యూ :
ఏమిటి : మోల్నుపిరావిర్‌ ఔషధాన్ని అభివృద్ధి చేసిన సంస్థ?
ఎప్పుడు : ఏప్రిల్‌ 21
ఎవరు : అమెరికాలోని ఇమోరీ యూనివర్సిటీకి చెందిన డ్రగ్‌ ఇన్నోవేషన్‌ వెంచర్స్‌ కంపెనీ
ఎక్కడ : అమెరికా
ఎందుకు : వైరస్‌లను నిరోధించేందుకు...
Published date : 22 Apr 2021 07:46PM

Photo Stories