Skip to main content

వైమానిక దళంలోకి తొలి యాంటీ రేడియేషన్ క్షిపణి

రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీవో) దేశీయంగా రూపొందించిన రుద్రం-1 క్షిపణిని వైమానిక దళంలో ప్రవేశపెట్టేందుకు దాదాపు రంగం సిద్ధమైంది.
Current Affairsదేశంలోనే తొలి యాంటీ రేడియేషన్ క్షిపణి అయిన రుద్రం 2022 నాటికి వైమానిక దళంలోకి చేరుతుందని అధికారులు తెలిపారు. ఈ క్షిపణి శత్రు దేశాల రాడార్లను, నిఘా వ్యవస్థలను తుత్తునియలు చేయగలదు. రుద్రం మిస్సైల్‌నుఒడిశాలోనివీలర్‌ ఐలాండ్‌లో అక్టోబర్‌ 9న సుఖోయ్‌–30 ఫైటర్‌ జెట్‌ ద్వారా పరీక్షించారు.

చదవండి: యాంటీ రేడియేషన్ క్షిపణి రుద్రం-1 మాక్ వేగం ఎంత?

నౌకా విధ్వంసక క్షిపణి ప్రయోగం విజయవంతం భారత నౌకాదళం అక్టోబర్ 30న చేసిన మరో క్షిపణి ప్రయోగం విజయవంతమైంది. తూర్పు నౌకాదళ పరిధిలో బంగాళాఖాతంలో క్షిపణి సామర్ధ్య యుద్ధనౌక ఐఎన్ఎస్‌ కోరా నుంచి ప్రయోగించిన నౌకా విధ్వంసక క్షిపణి విజయవంతంగా లక్ష్యాన్ని ఛేదించింది.
Published date : 31 Oct 2020 05:55PM

Photo Stories