Skip to main content

వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం ప్రారంభం

అతివృష్టి, అనావృష్టి, కరువు కాటకాలు, తదితర ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట దిగుబడి కోల్పోయిన రైతులకు ధీమా కల్పించేందుకు ఉద్దేశించిన ‘‘వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం’’ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రారంభమైంది.
Current Affairs

డిసెంబర్ 15న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్‌లో బటన్ నొక్కి ఈ పథకాన్ని ప్రారంభించారు. పథకంలో భాగంగా 2019 సీజన్‌లో పంట నష్టపోయిన 9.48 లక్షల మంది రైతులకు దాదాపు రూ.1,252 కోట్ల బీమా పరిహారాన్ని రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా రైతులనుద్ధేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం ప్రసంగించారు. ప్రస్తుతం ఏపీ అగ్రి మిషన్ వైస్ చైర్మన్‌గా ఎంవీఎస్ నాగిరెడ్డి ఉన్నారు.

సీఎం ప్రసంగం-ముఖ్యాంశాలు

  • పంటల బీమా పట్ల రైతుల్లో విశ్వసనీయత కల్పించాం. పంట నష్టపోతే ఇప్పుడు పంటల బీమా పరిహారం వస్తుందనే నమ్మకం వారిలో కలింగింది.
  • రైతులు కట్టాల్సిన ప్రీమియం వాటా రూ.468 కోట్లతో పాటు, ప్రభుత్వ వాటా రూ.503 కోట్లు.. రెండూ కలిపి రూ.971 కోట్ల ప్రీమియంను ప్రభుత్వమే చెల్లించింది.
  • ఇప్పుడు మన ప్రభుత్వం అక్షరాలా 49.80 లక్షల మంది రైతుల తరపున ప్రీమియం కడుతోంది. 1.14 కోట్ల ఎకరాలను ఇన్సూరెన్స్ పరిధిలోకి తెచ్చాం.
  • ఈ-క్రాప్‌లో నమోదైన ప్రతి రైతుకు లాభం ఉంటుంది. రైతుల బీమా కూడా కట్టి, ఉచిత పంటల బీమా పథకం అమలు చేస్తున్నాం. ఈ-క్రాప్ ద్వారా చాలా వేగంగా పరిహారం ఇచ్చే వీలుంటుంది.

క్విక్ రివ్యూ :

ఏమిటి : వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం ప్రారంభం
ఎప్పుడు : డిసెంబర్ 15
ఎవరు : ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : సీఎం క్యాంపు కార్యాలయం, తాడేపల్లి, గుంటూరు జిల్లా
ఎందుకు : అతివృష్టి, అనావృష్టి, కరువు కాటకాలు, తదితర ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట దిగుబడి కోల్పోయిన రైతులకు ధీమా కల్పించేందుకు
Published date : 16 Dec 2020 05:57PM

Photo Stories