వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం ప్రారంభం
Sakshi Education
పొదుపు సంఘాల మహిళలకు చేయూతనందించేందుకు ఉద్దేశించిన ‘వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం’ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏప్రిల్ 24న తన క్యాంపు కార్యాలయంలో లాంఛనంగా ప్రారంభించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం ప్రారంభం
ఎప్పుడు : ఏప్రిల్ 24
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎందుకు : పొదుపు సంఘాల మహిళలకు ఆర్థికంగా చేయూతనందించేందుకు
కంప్యూటర్ బటన్ నొక్కి మహిళల ఖాతాల్లోకి సున్నా వడ్డీ కింద రూ.1400 కోట్లను పంపించారు. అనంతరం జిల్లాల్లో స్వయం సహాయక సంఘాల మహిళలు, కలెక్టర్లతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.
ఆ వివరాలు ఇలా...
- సున్నా వడ్డీ పథకంపథకం ద్వారా పొదుపు సంఘాల మహిళలు బ్యాంకు నుంచి తీసుకున్న రుణాలపై వడ్డీ భారాన్నంతటినీ ఇకపై ప్రభుత్వమే భరించనుంది.
- కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు బ్యాంకులు రూ.3 లక్షల పరిమితి వరకు ఆరు జిల్లాల్లో 7 శాతం వడ్డీకి రుణాలు ఇస్తున్నాయి. మిగిలిన 7 జిల్లాల్లో డ్వాక్రా సంఘాలకు 11 నుంచి సుమారు 13 శాతం వరకూ వడ్డీ భారం వేస్తున్నారు. ఈ లెక్కన సున్నా వడ్డీ అమలు చేయాలంటే 7 శాతం నుంచి 13 శాతం వరకు ఉన్న వడ్డీని ప్రభుత్వమే చెల్లించాలి.
- ఈ పథకం ద్వారా 8 లక్షల 78 వేల గ్రూపుల్లోని 91 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు మేలు జరుగుతుంది. ప్రతి గ్రూపునకు కనీసం రూ.20 వేల నుంచి రూ.40 వేల వరకు లబ్ధి కలుగుతుంది. ప్రతి ఏటా ఈ పథకం ద్వారా ఆ మేరకు లబ్ధి పొందుతారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం ప్రారంభం
ఎప్పుడు : ఏప్రిల్ 24
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎందుకు : పొదుపు సంఘాల మహిళలకు ఆర్థికంగా చేయూతనందించేందుకు
Published date : 25 Apr 2020 06:18PM