Skip to main content

వైఎస్సార్ సంపూర్ణ పోషణ, ప్లస్ పథకాలు ప్రారంభం

గర్భిణులు, బాలింతలు, పిల్లలకు మెరుగైన పౌష్టికాహారాన్ని అందించేందుకు ఉద్దేశించిన ‘వైఎస్సార్ సంపూర్ణ పోషణ,’ వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్’ పథకాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకాలను సెప్టెంబర్ 7న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్‌లో బటన్ నొక్కి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... ‘హెల్దీ బాడీ ఉంటేనే హెల్దీ మైండ్.. అప్పుడే తల్లీ బిడ్డల్లో వికాసం ఉంటుంది’ అని అన్నారు. నాడు-నేడు ద్వారా 55,607 అంగన్‌వాడీల రూపురేఖలు మార్చబోతున్నామని, ప్రిప్రైమరీ కేంద్రాలుగా మార్పు చేస్తున్నామని పేర్కొన్నారు. పీపీ-1, పీపీ-2 మొదలు పెడుతున్నామని తెలిపారు.
Edu news

పథకాలు-వివరాలు

  • రాష్ట్రంలోని 77 గిరిజన మండలాల్లో ‘వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్’ పథకాన్ని, మిగిలిన మండలాల్లో ‘వైఎస్సార్ సంపూర్ణ పోషణ’ పథకాన్ని అమలు చేస్తారు.
  • ఈ పథకాల ద్వారా గర్భిణులు, బాలింతలకు ఆరో నెల నుంచి 36 నెలల వరకు, పిల్లలకు 36 నెలల నుంచి 72 నెలల వరకు పౌష్టికాహారాన్ని అందిస్తారు. 
  • రాష్ట్ర వ్యాప్తంగా 55,607 అంగన్‌వాడీ కేంద్రాల్లోని దాదాపు 30.16 లక్షల మందికిఈ పథకాల ద్వారా ప్రయోజం చేకూరనుంది. 
  • వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ కోసం రూ.307.55 కోట్లు, వైఎస్సార్ సంపూర్ణ పోషణ కార్యక్రమం కోసం దాదాపు రూ.1,555.56 కోట్లు ఖర్చు చేయనున్నారు. మొత్తంగా ఈ రెండు పథకాల కోసం ప్రభుత్వం ఏడాదికి రూ.1863.11 కోట్లు ఖర్చు చేయనుంది. 
  • రాష్ట్రంలో 47,287 అంగన్‌వాడీ కేంద్రాలు గిరిజనేతర ప్రాంతాల్లో ఉన్నారుు. వాటి పరిధిలో 26.36 లక్షల మంది తల్లులు, పిల్లలు ఉన్నారు.
  • 77 గిరిజన మండాలాల్లోని 8,320 అంగన్‌వాడీల పరిధిలో 3.8 లక్షల మంది పిల్లలు, తల్లులు ఉన్నారు.

 క్విక్ రివ్యూ   :

 ఏమిటి    : వైఎస్సార్ సంపూర్ణ పోషణ, ప్లస్ పథకాలు ప్రారంభం
 ఎప్పుడు       : సెప్టెంబర్ 7
 ఎవరు        : ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
 ఎక్కడ        : సీఎం క్యాంపు కార్యాలయం, తాడేపల్లి, గుంటూరు జిల్లా
 ఎందుకు    : గర్భిణులు, బాలింతలు, పిల్లలకు మెరుగైన పౌష్టికాహారాన్ని అందించేందుకు

Published date : 08 Sep 2020 05:23PM

Photo Stories