వైద్య పరికరాలపై కస్టమ్స్ సుంకం ఎత్తివేత: డబ్ల్యూటీవో
Sakshi Education
2020 సంవత్సరానికి వివిధ ప్రాంతీయ వాణిజ్య ఒప్పందాల కింద డబ్ల్యూటీవో(వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్) సభ్య దేశాలు దాదాపు 84 శాతం వైద్య పరికరాలపై కస్టమ్స్ సుంకాన్ని రద్దు చేశాయని డబ్ల్యూటీవో తెలిపింది.
ఈ మేరకు ఒక నివేదికను విడుదల చేసింది. తమ వైద్య పరికరాల ఎగుమతుల్లో చైనా 27 శాతం, ఇటలీ దాదాపు 75 శాతం తమతో ప్రాంతీయ వాణిజ్య ఒప్పందాలున్న సభ్య దేశాలకు చేస్తాయని నివేదికలో పేర్కొంది. 1995 నుంచి భారత్ డబ్ల్యూటీవో సభ్య దేశంగా ఉంది. కరోనా కారణంగా ప్రస్తుతం వెంటిలేటర్లు, మాస్క్‌లు తదితర వైద్య ఉపకరణాలకు భారీ డిమాండ్ ఏర్పడింది. వైద్య ఉత్పత్తులను ఎగుమతి చేసే టాప్ 10 దేశాలు.. ఏదో ఒక ప్రాంతీయ వాణిజ్య ఒప్పంద పరిధిలోనే ఉన్నాయి.
Published date : 29 Apr 2020 08:28PM