Skip to main content

వాట్సాప్‌లో వ్యక్తిగత సమాచారం తస్కరణ

వాట్సాప్‌లో భారత్‌కు చెందిన జర్నలిస్టులు, హక్కుల కార్యకర్తల వ్యక్తిగత సమాచారాన్ని ‘పెగాసస్’అనే స్పైవేర్ సాయంతో గుర్తు తెలియని సంస్థలు దొంగిలించాయని వాట్సాప్ సంస్థ అక్టోబర్ 31న ప్రకటించింది.
భారత్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా 1,400 మందిని లక్ష్యంగా చేసుకుని సమాచార చోరీ జరిగిందని వెల్లడించింది. ఈ అంశానికి సంబంధించి ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్‌ఎస్‌వో అనే నిఘా సంస్థపై అమెరికాలోని కాలిఫోర్నియా ఫెడరల్ కోర్టులో ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. భారత్‌లో బాధితుల వివరాలు తెలిపేందుకు వాట్సాప్ నిరాకరించింది.

తాజా వ్యవహారంతోపాటు, భారతీయ యూజర్ల వ్యక్తిగత సమాచార గోప్యతకు తీసుకుంటున్న చర్యలపై 2019, నవంబర్ 4లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని వాట్సాప్‌ను భారత ప్రభుత్వం ఆదేశించింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 150 కోట్ల వాట్సాప్ వినియోగదారుల్లో భారత్‌లో 40 కోట్ల మంది ఉన్నారు. ఎన్‌ఎస్‌వో అనే నిఘా సంస్థ ‘పెగాసస్’ స్పైవేర్‌ను అభివృద్ధి చేసింది.
Published date : 01 Nov 2019 05:37PM

Photo Stories