Skip to main content

వాటర్ షెడ్ ప్రాజెక్టుకు ప్రపంచ బ్యాంకు సాయం

ఆంధ్రప్రదేశ్‌లోని కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో చేపట్టే వాటర్ షెడ్ ప్రాజెక్టుకు ప్రపంచ బ్యాంకు ఆర్థిక సహాయం అందించనుంది.
Current Affairsఈ మేరకు ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల బృందం నవంబర్ 27న ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నితో సమావేశమై వాటర్ షెడ్ ప్రాజెక్టు అమలుపై చర్చించారు. ఈ విషయమై నీలం సాహ్ని మాట్లాడుతూ... ‘5 జిల్లాల్లో చేపట్టే వాటర్ షెడ్ ప్రాజెక్టుకు ప్రపంచ బ్యాంకు 70 శాతం నిధులు (178.50 మిలియన్ డాలర్లు) అందించనుంది. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కింద 30 శాతం నిధులను సమకూర్చనుంది’ అని తెలిపారు. వాటర్ షెడ్ ప్రాజెక్టు మంజూరైన తర్వాత ఆరేళ్లలో పూర్తి చేయాల్సి ఉందని పేర్కొన్నారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
వాటర్ షెడ్ ప్రాజెక్టుకు సాయం
ఎప్పుడు : నవంబర్ 27
ఎవరు : ప్రపంచ బ్యాంకు
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్
Published date : 28 Nov 2019 05:51PM

Photo Stories