Skip to main content

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విమానాశ్రయం ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా నిర్మించిన కర్నూలు జిల్లా ఓర్వకల్లు విమానాశ్రయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మార్చి 25న లాంఛనంగా ప్రారంభించారు.
Current Affairs
అనంతరం సీఎం మాట్లాడుతూ... ఈ విమానాశ్రయానికి ప్రథమ స్వాతంత్య్ర సమరయోధుడు ‘‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’’ పేరు పెడుతున్నట్లు ప్రకటించారు. తపాలా శాఖ రూపొందించిన విమానాశ్రయ పోస్టల్‌ స్టాంప్‌ను సీఎం విడుదల చేశారు.

విశేషాలు...
  • రూ.110 కోట్లతో ఆంధ్రప్రదేశ్‌ విమానాశ్రయాల అభివృద్ధి కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ఈ విమానాశ్రయాన్ని నిర్మించింది.
  • 2021, ఫిబ్రవరి 28వ తేదీ నుంచి ఎయిర్‌పోర్టులో విమానాల రాకపోకలు మొదలవుతాయి.
  • ఒకేసారి నాలుగు విమానాలు పార్కింగ్‌ చేసే సౌకర్యం ఇక్కడ ఉంది.
  • కర్నూలు నగరానికి 20 కిలోమీటర్ల దూరంలోని ఓర్వకల్లు వద్ద 1,008 ఎకరాల్లో ఎయిర్‌పోర్టు నిర్మాణం జరిగింది.
  • కర్నూలు ఎయిర్‌పోర్టు జిల్లా అభివృద్ధిలో కీలకపాత్ర పోషించనుంది.
  • జాతీయ రహదారి 40 (కర్నూలు–నంద్యాల–రాణిపేట్‌(తమిళనాడు))కి సమీపంలో ఈ ఎయిర్‌పోర్ట్‌ ఉంది.

క్విక్‌ రివ్యూ :

ఏమిటి : ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విమానాశ్రయం ప్రారంభం
ఎప్పుడు : మార్చి 25
ఎవరు : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : ఓర్వకల్లు, కర్నూలు జిల్లా
Published date : 27 Mar 2021 05:02PM

Photo Stories