ఉత్తరప్రదేశ్‌లో ధూళి తుపాను
Sakshi Education
ఉత్తరప్రదేశ్‌లో ధూళి తుపాను బీభత్సం సృష్టించింది.
జూన్ 7న సంభవించిన ఈ తుపాను కారణంగా ఉత్తరప్రదేశ్ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో 26 మంది మృతి చెందగా, 57 మంది గాయపడ్డారు. తుపాను ధాటికి ఇంటి గోడలు కూలిపోగా, చెట్లు నేలకొరిగాయి. మైన్‌పురిలో పలు చోట్ల గోడ కూలిన ఘటనలో అత్యధికంగా ఆరుగురు మృతి చెందారు. తుపాను బాధితులకు సాయం అందించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధికారులను ఆదేశించారు.
Published date : 08 Jun 2019 06:15PM