ఉత్తరాఖండ్ రాష్ట్రానికి ఒక రోజు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన యువతి?
హరిద్వార్‌కు చెందిన 20 ఏళ్ల గోస్వామి జనవరి 24న ముఖ్యమంత్రి హోదాలో అధికారిక విధులకు హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న పలు సంక్షేమ పథకాలను సమీక్షించారు. ప్రస్తుతం ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా త్రివేంద్ర సింగ్ రావత్ ఉన్నారు.
జాతీయ బాలికా దినోత్సవం
జాతీయ బాలికా దినోత్సవం ప్రతి సంవత్సరం జనవరి 24న నిర్వహించబడుతుంది. సమాజంలో బాలికల సంరక్షణ, హక్కులు, ఆరోగ్యం, విద్య, సామాజిక ఎదుగుదల మొదలైన అంశాలపై ఈ బాలికా దినోత్సవం రోజున అవగాహన కల్పిస్తారు.
2008 ఏడాది నుంచి...
ఆడపిల్ల అనగానే సమాజంలో చిన్నచూపు చూస్తున్నారు. అలాగే అంతేకాకుండా కడుపులో బిడ్డ ఆడపిల్ల అని తెలియగానే భ్రూణ హత్యలకు పాల్పడుతున్నారు. పుట్టిన తరువాత అనేక ఆంక్షలు విధిస్తున్నారు. వాటిని నిర్మూలించి ఆడపిల్లలపై ప్రత్యేక దృష్టిసారించే దిశగా భారత ప్రభుత్వం ‘నేషనల్ గర్ల్స్ డెవలప్మెంట్ మిషన్‘ పేరుతో ఒక కార్యక్రమం రూపొందించింది. అందులో భాగంగా 2008లో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంతో జాతీయ బాలికా దినోత్సవంను ప్రారంభించడం జరిగింది.
అంతర్జాతీయ బాలికా దినోత్సవం...
అంతర్జాతీయ బాలికా దినోత్సవం ప్రతి సంవత్సరం అక్టోబరు 11న నిర్వహించబడుతోంది. బాలికలపై జరుగుతున్న అత్యాచారాలను, అనర్థాలను నివారించి, వారి హక్కులను తెలియజేసేందుకు ఐక్యరాజ్యసమితి ఈ దినోత్సవాన్ని ప్రకటించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఉత్తరాఖండ్ రాష్ట్రానికి ఒక రోజు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన యువతి
ఎప్పుడు : జనవరి 24
ఎవరు : సృష్టి గోస్వామి
ఎందుకు : జాతీయ బాలికా దినోత్సవం(జనవరి 24) సందర్భంగా