ఉత్తరాఖండ్ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన బీజేపీ నేత?
Sakshi Education
ఉత్తరాఖండ్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా తీరథ్‌సింగ్ రావత్ (56) మార్చి 10న ప్రమాణ స్వీకారం చేశారు.
డెహ్రాడూన్‌లోని రాజ్‌భవన్‌లో నిరాడంబరంగా జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ బేబీ రాణి మౌర్య ఆయనతో ప్రమాణం చేయించారు. తీరథ్‌సింగ్ ఒక్కరే ప్రమాణం చేశారు. ఆయన తన మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకోవాల్సి ఉంది. అంతకుముందు ఆయనను రాష్ట్ర బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు.
పౌరీ గర్వాల్ నుంచి...
ఉత్తరాఖండ్‌లోని పౌరీ గర్వాల్ లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా తీరథ్‌సింగ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2013 నుంచి 2015 వరకూ ఉత్తరాఖండ్ బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. ప్రస్తుతం బీజేపీ జాతీయ కార్యదర్శిగానూ వ్యవహరిస్తున్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఉత్తరాఖండ్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం
ఎప్పుడు : మార్చి 10
ఎవరు : తీరథ్‌సింగ్ రావత్
ఎక్కడ : రాజ్‌భవన్, డెహ్రాడూన్

Published date : 11 Mar 2021 05:36PM