Skip to main content

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ రాజీనామా

ఉత్తరాఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ మార్చి 9న తన పదవికి రాజీనామా చేశారు.
Current Affairs

డెహ్రాడూన్‌లోని రాజ్‌భవన్‌లో రాష్ట్ర గవర్నర్‌ బేబీ రాణి మౌర్యను కలిసి రాజీనామా పత్రం సమర్పించారు. రాష్ట్ర పాలనను మరొకరు చేపట్టాలని తమ పార్టీ(బీజేపీ) నిర్ణయించిందని రావత్‌ తెలిపారు. 2017, మార్చి 18న రావత్‌ ఉత్తరాఖండ్‌ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. 2000 నవంబర్‌లో ఉత్తరప్రదేశ్‌ నుంచి విడిపడి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత ఇప్పటివరకు కాంగ్రెస్‌ నేత ఎన్‌డీ తివారీ మినహా ఏ ముఖ్యమంత్రి కూడా పూర్తిగా ఐదేళ్ల పాటు అధికారంలో కొనసాగకపోవడం ఉత్తరాఖండ్‌ ప్రత్యేకత.


ఉత్తరాఖండ్‌...

అవతరణ: నవంబర్‌ 9, 2000లోఉత్తరాంచల్‌ ఏర్పడింది. 2007లో ఉత్తరాఖండ్‌గా పేరు మార్చారు.
రాజధాని: డెహ్రడూన్‌(వేసవి కాలం), గైర్‌సెయిన్‌(శీతా కాలం)
ప్రస్తుత గవర్నర్‌: బేబీ రాణి మౌర్య
శాసనసభ సీట్లు: 70
లోక్‌సభ: 5
రాజ్యసభ: 3
హైకోర్టు: ఉత్తరాఖండ్‌ హైకోర్టు(నైనిటాల్‌లో ఉంది).

క్విక్‌ రివ్యూ :

ఏమిటి : ఉత్తరాఖండ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి రాజీనామా
ఎప్పుడు : మార్చి 9
ఎవరు : త్రివేంద్ర సింగ్‌ రావత్‌
Published date : 10 Mar 2021 05:59PM

Photo Stories