Skip to main content

ఉత్తర ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం

ఉత్తర ఢిల్లీలోని అనాజ్ మండీ ప్రాంతంలో ఉన్న నాలుగు అంతస్తుల భవనంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది.
Current Affairsడిసెంబర్ 8న జరిగిన ఈ ప్రమాదంలో 43 మంది కార్మికులు మృతి చెందారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఈ భవనంలో లగేజీ బ్యాగులు, ప్లాస్టిక్ బ్యాగుల తయారీ పరిశ్రమలు ఉన్నాయి. షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణమని అధికారుల ప్రాథమిక విచారణలో తేలింది. ఘటనా స్థలిని పరిశీలించిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, గాయపడినవారికి రూ.లక్ష సాయం ప్రకటించారు. ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేలు అందిస్తామని ప్రధాని కార్యాలయం వెల్లడించింది.

కార్బన్‌మోనాక్సైడ్ వల్లే..
కర్మాగారంలో మంటల్ని అదుపులోకి తీసుకువచ్చాక నేషనల్ డిజాస్టర్ రెస్పాన్‌‌స ఫోర్స్ (ఎన్‌డీఆర్‌ఎఫ్) ఘటనాస్థలాన్ని పరిశీలించింది. అగ్నిప్రమాదం కారణంగా గాల్లో కార్బన్ మోనాకై ్సడ్ ఎక్కువగా కలవడంతో ఉక్కిరిబిక్కిరై ఊపిరాడక కార్మికులు ప్రాణాలు కోల్పోయారని ఎన్‌డీఆర్‌ఎఫ్ డిప్యూటీ కమాండర్ ఆదిత్య ప్రతాప్ సింగ్ వెల్లడించారు. ప్లాస్టిక్, తోలు బ్యాగులు వంటివన్నీ మంటల్లో కాలడం వల్లనే కార్బన్ మోనాక్సైడ్ అధికంగా వెలువడిందని ఆయన వివరించారు.
Published date : 09 Dec 2019 06:03PM

Photo Stories