Skip to main content

ఉత్తమ ఠాణాల జాబితా విడుదల

కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో పనిచేసే బీపీఆర్‌డీ (బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్) జూన్ 26న ఉత్తమ ఠాణాలు-2018’ జాబితాను విడుదల చేసింది.
దేశవ్యాప్తంగా ఉన్న 86 పోలీస్‌స్టేషన్‌లతో రూపొందించిన ఈ జాబితాలో రాజస్థాన్‌లోని బికనీర్ జిల్లాకి చెందిన కలు పోలీస్ స్టేషన్ మొదటిస్థానంలో నిలిచింది. అండమాన్‌ నికోబార్‌ దీవుల్లోని నికోబార్‌ జిల్లాలో గల క్యాంప్‌బెల్‌ బే ఠాణా రెండో స్థానం, పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌ జిల్లాలో గల ఫరక్కా ఠాణా మూడో స్థానం పొందాయి. అలాగే తెలంగాణకి చెందిన నారాయణపురం ఠాణా 14వ స్థానం, చింతపల్లి పోలీసుస్టేషన్ 24వ స్థానంలో నిలిచాయి. రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో నారాయణపురం ఠాణా ఉండగా, నల్లగొండ జిల్లాలో చింతపల్లి పోలీసుస్టేషన్ ఉంది.

మౌలిక వసతులు, పనితీరు, ప్రజల మన్నన తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని ఉత్తమ ఠాణాల జాబితాను 2017 నుంచి రూపొందిస్తున్నారు.
Published date : 27 Jun 2019 05:49PM

Photo Stories