Skip to main content

Urban Co operative Banks: యూసీబీలపై ఆర్బీఐ నియమిత కమిటీకి నేతృత్వం వహించిన ఆర్థికవేత్త?

అర్బన్‌ కోపరేటివ్‌ బ్యాంకుల (యూసీబీలు)కు నాలుగు అంచెల నిర్మాణాన్ని  ఆర్‌బీఐ నియమిత కమిటీ సూచించింది.
డిపాజిట్లు, క్యాపిటల్‌ అడెక్వసీ రేషియో, పరిమాణం ఆధారంగా నియంత్రణపరమైన నిబంధనల ఆధారంగా ఈ సిఫారసు చేసింది. ప్రాథమిక పట్టణ సహకార బ్యాంకులపై అధ్యయనం, సిఫారసుల కోసం ఎన్‌ఎస్‌ విశ్వనాథన్‌ చైర్మన్‌గా ఆర్‌బీఐ 2021, ఫిబ్రవరిలో ఒక నిపుణుల కమిటీని నియమించిన విషయం విదితమే. కమిటీ తాజాగా తన సిఫారసుల నివేదికను ఆర్‌బీఐకి సమర్పించింది.

విశ్వనాథన్‌ కమిటీ సిఫార్సులు ఇవే...
  • రూ.100 కోట్ల వరకు డిపాజిట్లు కలిగిన యూసీబీలను టైర్‌–1 కింద వర్గీకరించాలి.
  • రూ.100–1,000 కోట్ల మధ్య డిపాజిట్‌లు ఉన్న యూసీబీలను టైర్‌–2 కింద పరిగణించాలి.
  • రూ.1,000–10,000 కోట్ల మధ్య డిపాజిట్‌లు కలిగిన యూసీబీలను టైర్‌–3 కింద వర్గీకరించాలి.
  • రూ.10,000 కోట్లకు పైగా డిపాజిట్‌లు ఉన్న యూసీబీలను టైర్‌–4 కింద విభజించాలి.
  • కనీస ‘క్యాపిటల్‌ టు రిస్క్‌ వెయిటెడ్‌ అసెట్స్‌ రేషియో’ (సీఆర్‌ఏఆర్‌) 9–15 శాతం మధ్య ఉండాలి.
  • బ్యాంకింగ్‌ నియంత్రణ చట్టం కింద యూసీబీల విలీనం, పునర్‌నిర్మాణానికి సంబంధించి ఆర్‌బీఐ ఒక పథకాన్ని రూపొందించుకోవచ్చు.

క్విక్‌ రివ్యూ :

ఏమిటి : అర్బన్‌ కోపరేటివ్‌ బ్యాంకుల (యూసీబీలు)కు నాలుగంచెల వ్యవస్థ ఉండాలని సిఫారసు
ఎప్పుడు : ఆగస్టు 23
ఎవరు : ఎన్‌ఎస్‌ విశ్వనాథన్‌ నేతృత్వంలోని ఆర్‌బీఐ నియమిత కమిటీ
ఎందుకు : పట్టణ సహకార బ్యాంకుల పనితీరు మెరుగుపడేందుకు...
Published date : 26 Aug 2021 12:10PM

Photo Stories