ఉపరాష్ట్రపతి సచిత్ర పుస్తకం ఆవిష్కరణ
Sakshi Education
భారత ఉపరాష్ట్రపతిగా ఎం. వెంకయ్య నాయుడు మూడేళ్ళ పదవీకాలాన్ని పూర్తి చేస్తుకున్న సందర్భంగా ఉపరాష్ట్రపతి సచివాలయం ‘‘కనెక్టింగ్, కమ్యూనికేటింగ్, చేంజింగ్’’పేరుతో రూపొందించిన సచిత్ర పుస్తకాన్ని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆవిష్కరించారు.
ఈ పుస్తకానికి సంబంధించిన డిజిటల్ వెర్షన్ ను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవడేకర్ ఆవిష్కరించారు. ఢిల్లీలోని ఉపరాష్ట్రపతి నివాసంలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ సమావేశ మందిరంలో ఆగస్టు 11న ఈ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. బలమైన సంకల్పం, సమష్టి కృషితోనే ఆర్థికంగా, సామాజికంగా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధ్యమౌతుందని ఉపరాష్ట్రపతి వెంకయ్య ఈ సందర్భంగా తెలిపారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : కనెక్టింగ్, కమ్యూనికేటింగ్, చేంజింగ్ పుస్తకం ఆవిష్కరణ
ఎప్పుడు : ఆగస్టు 11
ఎవరు : రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవడేకర్
ఎక్కడ : ఉపరాష్ట్రపతి భవన్, ఢిల్లీక్విక్ రివ్యూ :
ఏమిటి : కనెక్టింగ్, కమ్యూనికేటింగ్, చేంజింగ్ పుస్తకం ఆవిష్కరణ
ఎప్పుడు : ఆగస్టు 11
ఎవరు : రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవడేకర్
Published date : 12 Aug 2020 05:38PM