Skip to main content

ఊపిరితిత్తుల్లో కరోనా లక్ష్యాలు గుర్తింపు

కరోనా వైరస్‌ ఊపిరితిత్తుల్లో ఏయే కణాలపై దాడులు చేస్తుందో జర్మనీలోని బెర్లిన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ శాస్త్రవేత్తలు గుర్తించారు.
Current Affairs
శ్వాసకోశ నాళంలోని ప్రొజెనిటర్‌ కణాలపై కరోనా వైరస్‌లోని రిసెప్టర్‌ దాడి చేస్తున్నట్లు తాము గుర్తించామని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ ప్రొజెనిటర్‌ కణాల పైభాగంలో ఉండే వెంట్రుకల్లాంటి నిర్మాణాలు బ్యాక్టీరియాతోపాటు కఫం ఊపిరితిత్తుల నుంచి బయటకు వచ్చేందుకు దోహదపడతాయ‌న్నారు. హైడల్‌బర్గ్‌ లంగ్‌ బయో బ్యాంక్‌ నుంచి సేకరించిన 12 మంది ఊపిరితిత్తుల కేన్సర్‌ రోగుల నమూనాలతో తాము పరిశోధనలు చేశామని, అంతేకాకుండా ఆరోగ్యవంతుల శ్వాసకోశంలో ఉండే కణాలను కూడా పరిశీలించామని పేర్కొన్నారు. సుమారు 60 వేల కణాల జన్యుక్రమాలను పరిశీలించినప్పుడు కొన్ని ప్రత్యేకమైన ప్రొజెనిటర్‌ కణాలు కరోనా వైరస్‌ అతుక్కోగల రిసెప్టర్ల తయారీకి కీలకమని గుర్తించామని వివరించారు. దీనికి సంబంధించిన పరిశోధన వివ‌రాలు ఈఎంబీవో జర్నల్‌ తాజా సంచికలో ప్రచురితమ‌య్యాయి.

క్విక్ రివ్యూ :

ఏమిటి : ఊపిరితిత్తుల్లో కరోనా లక్ష్యాలు గుర్తింపు
ఎప్పుడు : ఏప్రిల్ 8
ఎవరు : జర్మనీలోని బెర్లిన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ శాస్త్రవేత్తలు
Published date : 09 Apr 2020 06:44PM

Photo Stories