ఉప రాష్ట్రపతికి కొమొరోస్ అత్యున్నత పౌర పురస్కారం
Sakshi Education
ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడికి అరుదైన గౌరవం దక్కింది.
ఆఫ్రికాలోని కొమొరోస్ పర్యటనలో ఉన్న వెంకయ్యనాయుడుకు ఆ దేశ ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారమైన ‘ద ఆర్డర్ ఆఫ్ ద గ్రీన్ క్రెసెంట్’ను ప్రదానం చేసింది. ఈ పురస్కారాన్ని ఆ దేశాధ్యక్షుడు అజాలీ అసౌమని చేతుల మీదుగా ఆయన అక్టోబర్ 11న అందుకున్నారు. వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. ‘కొమొరోస్ దేశ అత్యున్నత పౌరపురస్కారాన్ని అందుకోవడాన్ని గౌరవంగా భావిస్తున్నాను. ఈ అపూర్వ గౌరవాన్ని 130 కోట్ల మంది భారతీయుల తరఫున వినయపూర్వకంగా స్వీకరిస్తున్నాను.’ అని పేర్కొన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడికి కొమొరోస్ అత్యున్నత పౌర పురస్కారం
ఎప్పుడు: అక్టోబర్ 11, 2019
ఎవరు: ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు
ఎక్కడ: ఆఫ్రికాలోని కొమొరోస్
క్విక్ రివ్యూ:
ఏమిటి: ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడికి కొమొరోస్ అత్యున్నత పౌర పురస్కారం
ఎప్పుడు: అక్టోబర్ 11, 2019
ఎవరు: ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు
ఎక్కడ: ఆఫ్రికాలోని కొమొరోస్
Published date : 12 Oct 2019 04:19PM