Skip to main content

ఉన్నత విద్యాశాఖ మంత్రి కేటీ జలీల్‌ రాజీనామా

లోకాయుక్త నుంచి నెపోటిజం, అధికార దుర్వినియోగం వంటి అభియోగాలను ఎదుర్కొన్న కేరళ ఉన్నతవిద్యా మంత్రి కేటీ జలీల్‌ ఏప్రిల్‌ 13న రాజీనామా చేశారు.
Current Affairs
జలీల రాజీనామా లేఖను రాష్ట్ర గవర్నర్‌ ఆరిఫ్‌ మొహమ్మద్‌ ఖాన్‌ ఆమోదించారని ఏప్రిల్‌ 13న ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది.

కేరళ...
రాజధాని: తిరువనంతపురం
ప్రస్తుత గవర్నర్‌: ఆరిఫ్‌ మొహమ్మద్‌ ఖాన్‌
ప్రస్తుత ముఖ్యమంత్రి: పినరయి విజయన్‌

ఆస్ట్రియా ఆరోగ్య మంత్రి రాజీనామా
అధిక పనితో బాగా అలసి పోయానంటూ ఆస్ట్రియా ఆరోగ్య మంత్రి రుడాల్ఫ్‌ అన్సోబెర్‌ (60) ఏప్రిల్‌ 13న పదవికి రాజీనామా చేశారు. పనిభారం ఎక్కువై ఆరోగ్యం దెబ్బతిందని ఆయన పేర్కొన్నారు. పదవీ కాలంలో ఉన్న 15 నెలలు.. 15 ఏళ్లుగా గడిచాయని వివరించారు. కరోనా వచ్చిననాటి నుంచి ప్రభుత్వం తరఫున సూచనలు/సమాచారం అందించేందుకు రుడాల్ఫ్‌ తీవ్రంగా శ్రమించారు.

ఆస్ట్రియా...
రాజధాని: వియన్నా; కరెన్సీ: యూరో
ఆస్ట్రియా ప్రస్తుత అధ్యక్షుడు: అలెగ్జాండర్‌ వాన్‌ డెర్‌ బెల్లెన్‌
ఆస్ట్రియా ప్రస్తుత ఛాన్స్‌లర్‌: సెబాస్టియన్‌ కుర్జ్‌
Published date : 15 Apr 2021 05:54PM

Photo Stories