Skip to main content

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ సీఎస్‌ ఎస్వీ ప్రసాద్‌ కన్నుమూత

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఎస్వీ ప్రసాద్‌(69) కన్నుమూశారు.
Current Affairs
కరోనాకు చికిత్స పొందుతూ... హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో జూన్ 1న తుదిశ్వాస విడిచారు.1951 సెప్టెంబర్‌ 9న జన్మించిన ప్రసాద్... ఐఏఎస్‌గాఎంపికైన తర్వాత నెల్లూరు జిల్లాలోని గూడూరు సబ్‌కలెక్టర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు.1975 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన ఆయన 1982 అక్టోబర్‌లో కడప జిల్లా కలెక్టర్‌గా, 1983లో విశాఖ కలెక్టర్‌గా పనిచేశారు. 1985లో ఆప్కాబ్‌ ఎండీగా, ఆ తర్వాత ఆల్విన్‌ ఎండీగా, ఐఅండ్‌పీఆర్‌ కమిషనర్‌గా, సీఎం కార్యదర్శిగా, సీఎం ప్రిన్సిపల్‌ సెక్రటరీగా, చీఫ్‌ కమిషనర్‌ ఆఫ్‌ ల్యాండ్‌ అడ్మినిస్ట్రేటర్‌గా... ఇలా వేరు వేరు హోదాల్లో విధులు నిర్వర్తించారు. 2010 ప్రారంభం నుంచి దాదాపు రెండేళ్లపాటు ఆయన ఉమ్మడి ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు.

క్విక్ రివ్యూ :

ఏమిటి : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికన్నుమూత
ఎప్పుడు : జూన్ 1
ఎవరు : ఎస్వీ ప్రసాద్‌(69)
ఎక్కడ : యశోద ఆసుపత్రి, హైదరాబాద్‌
ఎందుకు :కరోనా వైరస్ కారణంగా...
Published date : 04 Jun 2021 12:22PM

Photo Stories