ఉల్లి ఎగుమతులపై నిషేధం
Sakshi Education
దేశీయ మార్కెట్‌లో ధరలను అదుపులో ఉంచడం కోసం అన్ని రకాల ఉల్లి ఎగుమతులను తక్షణమే నిషేధిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 29 ప్రకటించింది.
అలాగే వ్యాపారుల వద్ద ఉండాల్సిన నిల్వల పరిమితిపైనా ఆంక్షలు విధించింది. చిల్లర వర్తకులు 100 క్వింటాళ్లు, టోకు వ్యాపారులు 500 క్వింటాళ్లకు మించి నిల్వ ఉంచుకోరాదని ఆదేశించింది. ఉల్లి సరఫరాకు ఇబ్బందులు వచ్చి దేశంలోని పలు ప్రాంతాల్లో కిలో ఉల్లి రూ.60-80 మధ్య పలుకుతున్న నేపథ్యంలో కేంద్రం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఉల్లి సాగు అధికంగా ఉండే మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదల కారణంగా దిగుబడి తగ్గిపోవడం ధరల పెరుగుదలకు ప్రధాన కారణం. అలాగే వ్యాపారులు ఉల్లిని నిల్వచేసి కృత్రిమ కొరత సృష్టించడం, విదేశాలకు ఎగుమతి చేస్తుండటంతో ధరలు పెరిగాయి.
భారత్ ప్రధానంగా బంగ్లాదేశ్, శ్రీలంక, యూఏఈ దేశాలకు ఉల్లిని ఎగుమతి చేస్తోంది. 2019 ఏడాది తొలి నాలుగు నెలల్లో రూ.1089 కోట్ల విలువైన ఉల్లిని భారత్ ఎగుమతి చేసింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఉల్లి ఎగుమతులపై నిషేధం
ఎప్పుడు : సెప్టెంబర్ 29
ఎవరు : కేంద్రప్రభుత్వం
ఎందుకు : దేశీయ మార్కెట్‌లో ఉల్లి ధరలను అదుపులో ఉంచడం కోసం

Published date : 30 Sep 2019 05:50PM