Skip to main content

ఉజ్బెకిస్తాన్‌ ఓపెన్‌ స్విమ్మింగ్‌ టోర్నిలో స్వర్ణం గెలిచిన మహిళా స్విమ్మర్‌?

ఉజ్బెకిస్తాన్‌ ఓపెన్‌ అంతర్జాతీయ స్విమ్మింగ్‌ టోర్నమెంట్‌లో భారత మహిళా స్విమ్మర్‌ కెనిషా గుప్తా మూడో స్వర్ణ పతకాన్ని దక్కించుకుంది.
Current Affairs
ఉజ్బెకిస్తాన్‌ రాజధాని నగరం తాష్కెంట్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో ఏప్రిల్‌ 16న జరిగిన 50 మీటర్ల ఫ్రీస్టయిల్‌ ఈవెంట్‌లో మహారాష్ట్రకు చెందిన కెనిషా 26.61 సెకన్లలో గమ్యానికి చేరి విజేతగా నిలిచింది. 17 ఏళ్ల కెనిషా ఇదే టోర్నీలో 100, 200 మీటర్ల ఫ్రీస్టయిల్‌ ఈవెంట్స్‌లోనూ పసిడి పతకాలు గెలిచింది.

భారత్‌కు నీరవ్‌ మోదీ అప్పగింతకు అంగీకారం
పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకును దాదాపు రూ.13,000 కోట్ల మేర మోసగించిన కేసులో ప్రధాన నిందితుడైన వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీ(50)ని భారత్‌కు రప్పించేందుకు రంగం సిద్ధమయ్యింది. అతడిని భారత్‌కు అప్పగించేందుకు యునైటెడ్‌ కింగ్‌డమ్‌(యూకే) ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ఈ విషయాన్ని యూకేలోని భారత రాయబార వర్గాలు ఏప్రిల్‌ 16న వెల్లడించాయి. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు రుణాలకు సంబంధించి మోసం, మనీలాండరింగ్‌ కేసులు నీరవ్‌ మోదీపై నమోదయ్యాయి. ఆయన ప్రస్తుతం లండన్‌లోని వాండ్స్‌వర్త్‌ జైలులో ఉన్నారు.

క్విక్‌ రివ్యూ :

ఏమిటి : ఉజ్బెకిస్తాన్‌ ఓపెన్‌ స్విమ్మింగ్‌ టోర్ని 50 మీటర్ల ఫ్రీస్టయిల్‌ ఈవెంట్‌లో స్వర్ణం గెలిచిన మహిళా స్విమ్మర్‌?
ఎప్పుడు : ఏప్రిల్‌ 16
ఎవరు : కెనిషా గుప్తా
ఎక్కడ : తాష్కెంట్, ఉజ్బెకిస్తాన్‌
Published date : 19 Apr 2021 11:40AM

Photo Stories