Skip to main content

ఉగ్రవాదం-స్పందన సదస్సులో మోదీ

ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ 74వ సమావేశాల సందర్భంగా ‘ఉగ్రవాదం, హింసాత్మక తీవ్రవాదంపై నాయకుల వ్యూహాత్మక స్పందన’ అంశంపై సెప్టెంబర్ 24న నిర్వహించిన శిఖరాగ్ర సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు.
మంచి, చెడు.. చిన్న, పెద్ద.. అంటూ ఉగ్రవాద దాడులను వర్గీకరించడం సరికాదని ఈ సందర్భంగా మోదీ అన్నారు. ప్రపంచంలో ఎక్కడ జరిగినా, ఏ స్థాయి దాడైనా.. ఉగ్రదాడిని ఉగ్రవాద చర్యగానే పరిగణించాలని ప్రపంచదేశాలకు స్పష్టం చేశారు.

మోదీ ప్రసంగంలోని ముఖ్యాంశాలు
  • ఉగ్రవాద వ్యతిరేక చర్యల్లో ప్రపంచదేశాలు పరస్పర సహకారాన్ని వివిధ స్థాయిల్లో వ్యవస్థీకృతం చేయాల్సిన అవసరం ఉంది.
  • ఉగ్రవాదులు నిధులు, ఆయుధాలు సమకూర్చుకోకుండా చూడాల్సి ఉంది.
  • ఉగ్రవాదంపై పోరులో ప్రపంచ దేశాలు సహకారం, సమాచార పంపిణీ.. తదితరాలపై ద్వైపాక్షిక, ప్రాంతీయ ఒప్పందాలను ఏర్పర్చుకోవాల్సి ఉంది.
  • ఉగ్రవాద, తీవ్రవాద భావజాలాల్ని ఎదుర్కొనేందుకు భారత్ ప్రజాస్వామ్య విలువలు, భిన్నత్వంపై గౌరవం, సమ్మిళిత అభివృద్ధి మొదలైన కీలక ఆయుధాలను ఉపయోగిస్తోంది.
  • ఉగ్రవాదంపై పోరుకు సంబంధించి ఐరాస ఆంక్షలు, ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్.. మొదలైన వాటిని రాజకీయం చేయకూడదు.
  • ఆన్‌లైన్‌లోని ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే, సమర్ధించే సమాచారాన్ని తొలగించేందుకు ఉద్దేశించిన క్రైస్ట్‌చర్చ్ పిలుపునకు మద్దతు పలుకుతున్నాం.
Published date : 25 Sep 2019 05:45PM

Photo Stories