Skip to main content

ఉగ్రవాద దేశాలే బాధ్యులు: మోదీ

షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్‌సీవో) సదస్సు వేదికగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ఉగ్రవాదానికి ఊతమిస్తున్న దేశాలపై విరుచుకుపడ్డారు.
ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న, ఆర్థిక సహాయం చేస్తున్న దేశాలను తప్పనిసరిగా బాధ్యుల్ని చేయాలని కిర్గిజిస్తాన్ రాజధాని బిష్కెక్‌లో జూన్ 14న జరిగిన సదస్సులో మోదీ ఎస్‌సీవో నేతలకు స్పష్టం చేశారు. ఈ సదస్సులో పాల్గొన్న పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ను ఉద్దేశించి పరోక్షంగా మోదీ ఈ వ్యాఖ్య చేశారు.

ఎస్‌సీవో ప్రాంతీయ తీవ్రవాద వ్యతిరేక విధానం(ర్యాట్స్)కింద ఉగ్రవాదంపై పోరుకు సహకరించాలని మోదీ ఎస్‌సీవో నేతలను కోరారు. ఉగ్రవాదాన్ని అరికట్టే విషయమై అంతర్జాతీయ సదస్సు నిర్వహించాలని పిలుపునిచ్చారు. చైనా నాయకత్వంలో ఎనిమిది దేశాలతో ఎస్‌సీవో ఏర్పాటయింది. 2017లో భారత, పాకిస్తాన్‌లకు దీనిలో సభ్యత్వం లభించింది.

‘హెల్త్’ అంశాల్లో సహకారం
ఎస్‌సీఓ సభ్య దేశాల మధ్య ‘హెల్త్’-హెచ్‌ఈఏఎల్‌టీహెచ్- అంశాల్లో సహకారం ఉండాలని ఎస్‌సీఓ సదస్సులో మోదీ ఆకాంక్షించారు. హెచ్-ఆరోగ్యం (హెల్త్), ఈ- ఆర్థికం (ఎకనామిక్), ఎ-ప్రత్యామ్నాయ ఇంధనం (ఆల్టర్నేటివ్ ఎనర్జీ), ఎల్-సాహిత్యం, సంస్కృతి (లిటరేచర్, కల్చర్), టి-ఉగ్రవాద రహిత సమాజం (టైజం ఫ్రీ సొసైటీ), హెచ్-మానవీయ సహకారం (హ్యుమానిటేరియన్ కోఆపరేషన్) అని ఆయనవివరించారు.
Published date : 15 Jun 2019 06:12PM

Photo Stories