Skip to main content

ఉగ్రసంస్థ తాలిబన్‌పై నిషేధం విధించిన సామాజిక మాధ్యమం?

తాలిబన్‌ ముఠాను ఉగ్రవాద సంస్థగా తాము పరిగణిస్తున్నట్లు సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ ఆగస్టు 17న ప్రకటించింది.

తాలిబన్‌ ఉగ్రవాదులను సమర్థించే అన్ని రకాల సమాచారాన్ని(కంటెంట్‌) నిషేధిస్తున్నట్లు, దాన్ని తమ వేదిక నుంచి పూర్తిగా తొలగిస్తున్నట్లు స్పష్టం చేసింది.‘‘అమెరికా చట్టాల కింద తాలిబన్ల ముఠాను ఉగ్రవాద సంస్థగా నిర్ధారించారు. డేంజరస్‌ ఆర్గనైజేషన్‌ పాలసీల కింద మా సేవల నుంచి తాలిబన్లను నిషేధించాం. తాలిబన్లు నిర్వహించే, వారి తరపున నిర్వహించే ఫేస్‌బుక్‌ ఖాతాలను తొలగించాం.ఫేస్‌బుక్‌లో వారిని ప్రశంసించడాన్ని, సమర్థించడాన్ని, వారి తరపున వాదించడాన్ని మేము నిషేధించాం’’ అనిఫేస్‌బుక్‌ అధికార ప్రతినిధి తెలిపారు. దేశాల ప్రభుత్వాలను గుర్తించడంపై తాము ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, ఈ విషయంలో అంతర్జాతీయ సమాజాన్ని అనుసరిస్తామని చెప్పారు. తాలిబన్ల కంటెంట్‌పై నిషేధం ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌లో సైతం అమలవుతుందని వెల్లడించారు.

క్విక్‌ రివ్యూ :
ఏమిటి :ఉగ్రసంస్థ తాలిబన్‌పై నిషేధం విధించిన సామాజిక మాధ్యమం?
ఎప్పుడు : ఆగస్టు17
ఎవరు :ఫేస్‌బుక్‌
ఎందుకు :తాలిబన్‌ ముఠాను ఉగ్రవాద సంస్థగాపరిగణిస్తున్నందున...

Published date : 18 Aug 2021 06:41PM

Photo Stories