Skip to main content

ఉద్యోగాలకు ఆకర్షణీయ సంస్థల్లో అగ్రస్థానంలో నిలిచిన సంస్థ?

ఉద్యోగాలకు సంబంధించి అత్యంత ఆకర్షణీయమైన ఎంప్లాయర్‌ బ్రాండ్‌గా టెక్‌ దిగ్గజం గూగుల్‌ ఇండియా అగ్రస్థానం దక్కించుకుంది.
Current Affairs

అమెజాన్‌ ఇండియా, మైక్రోసాఫ్ట్‌ ఇండియా తర్వాత స్థానాల్లో నిలిచాయి. జూన్‌ 29న విడుదలైన రాండ్‌స్టాడ్‌ ఎంప్లాయర్‌ బ్రాండ్‌ రీసెర్చ్‌ (ఆర్‌ఈబీఆర్‌) 2021 సర్వే నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ఆర్థిక పరిస్థితి, ప్రతిష్ట, ఆకర్షణీయమైన వేతనాలు, ప్రయోజనాలు వంటి అంశాల ప్రాతిపదికన ఈ నివేదికను రూపొందించారు. నివేదిక ప్రకారం...

  • టాప్‌ 10 ఆకర్షణీయ ఎంప్లాయర్‌ బ్రాండ్స్‌ జాబితాలో గూగుల్‌ ఇండియా(1వ స్థానం), అమెజాన్‌ ఇండియా(2వ స్థానం), మైక్రోసాఫ్ట్‌ ఇండియా(3వ స్థానం), ఇన్ఫోసిస్‌(4వ స్థానం), టాటా స్టీల్‌(5), డెల్‌(6), ఐబీఎం(7), టీసీఎస్‌(8), విప్రో(9), సోని(10) ఉన్నాయి.
  • ఆకర్షణీయమైన జీతభత్యాలతో పోలిస్తే (62 శాతం).. ఉద్యోగం, కుటుంబం మధ్య సమతౌల్యానికే(65 శాతం) ఉద్యోగార్థులు ప్రాధాన్యమిస్తున్నారు.
  • కోవిడ్‌–19 నిబంధనలకు అనుగుణమైన పని వాతావరణం(61 శాతం), ఉద్యోగ భద్రత(61 శాతం) అంశాలు తర్వాత స్థా¯ ల్లో ఉన్నాయి.
  • 34 దేశాల్లో 6,493 కంపెనీలపై నిర్వహించిన ఈ సర్వేలో 1,90,000 మంది పాల్గొన్నారు.

క్విక్‌ రివ్యూ :

ఏమిటి : ఉద్యోగాలకు ఆకర్షణీయ సంస్థల్లో అగ్రస్థానంలో నిలిచిన సంస్థ?
ఎప్పుడు : జూన్‌ 29
ఎవరు : గూగుల్‌ ఇండియా
ఎక్కడ : భారత్‌
ఎందుకు : ఆర్థిక పరిస్థితి, ప్రతిష్ట, ఆకర్షణీయమైన వేతనాలు, ప్రయోజనాలు వంటి అంశాల ప్రాతిపదికన...
Published date : 30 Jun 2021 06:03PM

Photo Stories