ఉడుపి పెజావర స్వామీజీ అస్తమయం
Sakshi Education
దక్షిణాది ఆధ్యాత్మిక ప్రముఖుల్లో ఒకరైన ఉడుపి పెజావర మఠాధిపతి శ్రీ విశ్వేశతీర్థ స్వామీజీ(88) కన్నుమూశారు.
గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన డిసెంబర్ 29న ఉడుపి పెజావర మఠంలో తుదిశ్వాస విడిచారు. స్వామీజీ భౌతిక కాయంపై కర్ణాటక సీఎం యెడియూరప్ప జాతీయ జెండా కప్పి నివాళులర్పించారు. ప్రభుత్వ లాంఛనాల మధ్య బెంగళూరులోని విద్యాపీఠ ఆవరణలో అంత్యక్రియలు ముగిశాయి. ప్రభుత్వం 3 రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది.
మధ్వాచార్యుడు స్థాపించిన మఠం
800 ఏళ్ల క్రితం శ్రీ మధ్వాచార్యుడు స్థాపించిన ఉడుపి అష్ట మఠాల్లో పెజావర మఠం ఒకటి. ప్రసిద్ధ ఉడుపి శ్రీకృష్ణ ఆలయ బాధ్యతలను ఈ మఠాలు విడతల వారీగా పర్యవేక్షిస్తుంటాయి. పెజావర మఠ పెద్దల్లో విశ్వేశ స్వామీజీ 33వ వారు. 1931 ఏప్రిల్ 27న రామ కుంజలోని బ్రాహ్మణ కుటుంబంలో ఆయన జన్మించారు. 1938లో సన్యాసం స్వీకరించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఉడుపి పెజావర మఠాధిపతి అస్తమయం
ఎప్పుడు : డిసెంబర్ 29
ఎవరు : శ్రీ విశ్వేశతీర్థ స్వామీజీ(88)
ఎక్కడ : ఉడుపి పెజావర మఠం
ఎందుకు : అనారోగ్యం కారణంగా

Published date : 30 Dec 2019 06:12PM