Skip to main content

ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకాన్ని తొలుత ఏ జిల్లాలో అమలు చేయనున్నారు?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతులకు ప్రభుత్వం అందిస్తున్న ఉచిత విద్యుత్ పథకాన్ని ఇక నుంచి ‘వైఎస్సార్ ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకం’గా పిలుస్తారు.
Edu news
ఈ మేరకు సెప్టెంబర్ 7న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పథకం ద్వారా రైతుల ఉచిత విద్యుత్‌కు ప్రభుత్వం అందించే సబ్సిడీ మొత్తాన్ని 2021-22 నుంచి నేరుగా రైతుల ఖాతాల్లోకి, అక్కడి నుంచి విద్యుత్ పంపిణీ సంస్థకు బదిలీ చేస్తారు. నగదు బదిలీ విధానాన్ని తొలుత శ్రీకాకుళం జిల్లాలో ప్రయోగాత్మకంగా 2020, సెప్టెంబర్ నెల నుంచి ప్రారంభించనున్నారు.

యుఐ పపాత్‌తో ఎంవోయూ...
ఆంధ్రప్రదేశ్‌లోని ఇంజనీరింగ్ విద్యార్థులకు శిక్షణ ఇచ్చి నైపుణ్యాలను పెంపొందించేందుకు ప్రముఖ రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ (ఆర్‌పీఏ) సాఫ్ట్‌వేర్ కంపెనీ ‘యుఐ పపాత్’తో రాష్ట్ర స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎంవోయూ చేసుకుంది. ఏడాది వ్యవధిలో 50 వేల మంది ఇంజనీరింగ్ విద్యార్థులకు శిక్షణ ఇచ్చి పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దనున్నట్లు స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చల్లా మధుసూదనరెడ్డి తెలిపారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
వైఎస్సార్ ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకం తొలుత అమలు
ఎప్పుడు : సెప్టెంబర్ 7
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఎక్కడ : శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్
ఎందుకు : రైతుల ఉచిత విద్యుత్‌కు ప్రభుత్వం అందించే సబ్సిడీ మొత్తాన్ని నేరుగా రైతుల ఖాతాల్లోకి వేసేందుకు
Published date : 08 Sep 2020 05:24PM

Photo Stories