ఉభయచర డ్రోన్ పడవను పరీక్షించిన చైనా
Sakshi Education
ప్రపంచంలోనే తొలిసారిగా రూపొందించిన సాయుధ ఉభయచర డ్రోన్ పడవ ‘మెరైన్ లిజర్డ్’ను చైనా విజయవంతంగ పరీక్షించింది.
వుచాంగ్ నౌకా నిర్మాణ సంస్థ రూపొందించిన ఈ పడవను నీటితో పాటు నేల మీద జరిగే పోరాటాల్లోనూ ఉపయోగించవచ్చు. 12 మీటర్ల పొడవున్న ఈ పడవ నీటిలో శత్రువు కంటపడకుండా సంచరిస్తూ గంటకు 50 నాట్‌ల వేగాన్ని అందుకోగలదు. నేల మీద గంటకు 20 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. ఎలక్టో్ర-ఆప్టికల్ వ్యవస్థ, రాడార్ కలిగి విమానాలను విధ్వంసం చేసే క్షిపణులను ప్రయోగించగలదు. ఏకబిగిన 1200 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలిగే ఈ పడవను ఉపగ్రహాల ద్వారా రిమోట్ సాయంతో నియంత్రించవచ్చు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఉభయచర డ్రోన్ పడవ ‘మెరైన్ లిజర్డ్’ను పరీక్షించిన చైనా
ఎప్పుడు : ఏప్రిల్ 15
ఎవరు : చైనా
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఉభయచర డ్రోన్ పడవ ‘మెరైన్ లిజర్డ్’ను పరీక్షించిన చైనా
ఎప్పుడు : ఏప్రిల్ 15
ఎవరు : చైనా
Published date : 16 Apr 2019 06:00PM