Skip to main content

ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ తమిళిసై ప్రసంగం

ఆరు దశాబ్దాలపాటు పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రజల అవసరాలే ప్రాతిపదికగా ప్రభుత్వ పాలన కొనసాగుతోందని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు.
Current Affairsశాసనసభ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా మార్చి 6న ఉభయ సభలను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. రాష్ట్రంలోని వనరులు, వసతులు, అవసరాలు, అనుకూలతలు, ప్రతికూలతలు, బలాలు, బలహీనతలన్నింటినీ అంచనా వేసుకొని స్వల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక ప్రణాళికల వంటి మూడంచెల ప్రణాళికలను రూపొందించుకొని రాష్ట్ర పునర్నిర్మాణ యజ్ఞాన్ని ప్రభుత్వం ప్రారంభించిందన్నారు.

గవర్నర్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు
  • పేదలకు కనీస జీవన భద్రత కల్పించాలని ప్రభుత్వం సంక్షేమ రంగానికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చింది.
  • వృద్ధాప్య పెన్షన్ల అర్హత వయసును 65 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలోనే వారందరికీ పెన్షన్లు అందుతాయి.
  • దేశంలోనే తలసరి విద్యుత్ వినియోగం అధికంగా కలిగిన రాష్ట్రంగా తెలంగాణ నిలబడింది. సమైక్య రాష్ట్రంలో 13,162 మెగావాట్ల గరిష్ట డిమాండ్ ఏర్పడితే తెలంగాణ రాష్ట్రంలో 13,168 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఉంది.
  • ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ఎత్తిపోతల పథకంగా రికార్డు సృష్టించిన కాళేశ్వరం ప్రాజెక్టు త్వరలోనే పూర్తికానుంది.
  • వ్యవసాయాభివృద్ధి కోసం ప్రపంచవ్యాప్తంగా అమలవుతున్న గొప్ప పథకాల్లో రైతుబంధు ఒకటని ఐక్యరాజ్యసమితి కీర్తించడం మనకు గర్వకారణం.
  • ప్రజలకు అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించి తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ రూపొందిస్తాం.
  • 2013-14లో రాష్ట్ర ఐటీ ఎగుమతుల విలువ రూ. 57 వేల కోట్లు కాగా 2018-19 నాటికి రూ. 1.09 లక్షల కోట్లకు చేరింది.
Published date : 07 Mar 2020 05:48PM

Photo Stories