Skip to main content

Daily Current Affairs in Telugu: 2022, జులై 1st కరెంట్‌ అఫైర్స్‌

Current Affairs in Telugu July 1st 2022(డైలీ కరెంట్‌ అఫైర్స్‌ తెలుగులో): Current Affairs for All Competitive Exams In Telugu. Latest Articles useful for TSPSC &APPSC Group-1,2,3, 4, SSC, Bank, SI, Constable and all other competitive examinations
Current Affairs in Telugu July 1st 2022
Current Affairs in Telugu July 1st 2022

Eknath Shinde:మహారాష్ట్ర 20వ ముఖ్యమంత్రిగా ఏక్ నాథ్ షిండే 

మహారాష్ట్ర నూతన (20వ) ముఖ్యమంత్రిగా శివసేన రెబెల్ నాయకుడు ఏక్ నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రిగా బీజేపీ నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ ప్రమాణ స్వీకారం చేశారు. రాత్రి 7.30 గంటల తర్వాత రాజ్‌భవన్‌లో గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోషియారీ వారిద్దరితో ప్రమాణ స్వీకారం చేయించారు. అనూహ్యమైన మలుపులు చోటుచేసుకున్న మహారాష్ట్ర రాజకీయ సంక్షోభానికి తెరపడింది. మహా వికాస్‌ అఘాడీ(ఎంవీఏ) ప్రభుత్వం కూలిపోయిన 24 గంటల్లోనే.. రాజకీయ పండితుల అంచనాలను తలకిందులు చేస్తూ శివసేన తిరుగుబాటు వర్గం–బీజేపీ కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. 

Also read: GK International Quiz: ప్రపంచంలోనే అతిపెద్ద గ్లాస్ బాటమ్ బ్రిడ్జిని ఏ దేశంలో ప్రారంభించారు?

ఏక్‌నాథ్‌ షిండే తొలుత దివంగత శివసేన అగ్రనేతలు బాల్‌ ఠాక్రే, ఆందన్‌ డిఘేకు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ప్రమాణ స్వీకారం చేశారు.  సీఎంగా తన నియామకం బాల్‌ ఠాక్రే సిద్ధాంతానికి, తన గురువు ‘ధర్మవీర్‌’ఆనంద్‌ డిఘే బోధనలకు లభించిన విజయమని వెల్లడించారు. మహారాష్ట్ర కొత్త ప్రభుత్వంలో తాను భాగస్వామిగా ఉండడం లేదంటూ దేవేంద్ర ఫడ్నవీస్‌ మొదట ప్రకటించారు. అయినప్పటికీ ప్రభుత్వ పరిపాలన సాఫీగా సాగడానికి తన వంతు సాయం అందిస్తానన్నారు. కొద్దిసేపటి తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా స్పందిస్తూ.. ఏక్‌నాథ్‌ షిండే నేతృత్వంలోని నూతన మంత్రివర్గంలో ఫడ్నవీస్‌ ఒక సభ్యుడిగా కొనసాగుతారని తేల్చిచెప్పారు. బీజేపీ పెద్దల ఆదేశాలతో మంత్రివర్గంలో చేరడానికి, ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఫడ్నవీస్‌ అంగీకరించినట్లు సమాచారం.

TS Exports: సులభతర వాణిజ్యంలో తెలంగాణకు అగ్రస్థానం

సులభతర వాణిజ్య విధానం (ఈవోడీబీ) ర్యాంకుల్లో 2020కి సంబంధించి తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. కేంద్ర పరి శ్రమలకు శాఖకు అనుబంధంగా ఉండే పరి శ్రమల ప్రోత్సాహక, అంతర్గత వాణిజ్య విభాగం(డీపీఐ ఐటీ) ఏటా ప్రకటించే సులభతర వాణిజ్యం ర్యాంకులను జూన్ 30న వెల్లడించింది. గతంలో ఉన్న ర్యాంకుల విధా నానికి స్వస్తి పలుకుతూ ఈ ఏడాది రాష్ట్రాలను టాప్‌ అఛీ వర్స్, అఛీవర్స్, అస్పైరర్స్, ఎమర్జింగ్‌ ఇకో సిస్టమ్స్‌ అనే 4  కేటగిరీ లుగా విభజించింది. అయితే టాప్‌ అఛీవర్స్‌ జాబితాలో తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, గుజరాత్, హరి యాణా, కర్ణాటక, తమిళనాడు, పంజాబ్‌ రాష్ట్రాలు ఉన్నాయి. బిజినెస్‌ రిఫార్మ్స్ యాక్షన్‌ ప్లాన్‌లో భాగంగా 301 అంశాల్లో సంస్కరణలు చేపట్టాలని డీపీఐఐటీ ఆదే శించింది. అం దులో భాగంగా తెలంగాణ 301 అంశాల్లోనూ సంస్క రణలు చేపట్టి నూటికి నూరు శాతం మార్కులు సాధించింది. అయితే గతంలో ర్యాంకుల ప్రకట నలో ఎదురైన అస్పష్టతను దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది కేటగిరీ లుగా వెల్లడించింది. 301 సంస్కరణల్లో కొన్ని రాష్ట్రాలకు ఒకటి, రెండు అంశాల్లోనూ అగ్రస్థానం దక్కిం దని, తెలంగాణ మాత్రం అనేక నిబంధనల్లో అగ్రస్థానం దక్కించు కుందని పరిశ్రమల శాఖ వర్గాలు వెల్లడించాయి. 

Also read: Business Reforms Action Plan : నెంబ‌ర్ 1 స్థానంలో ఏపీ.. త‌ర్వాత‌ ప్లేస్‌లో ఇవే..

2015లో ఈవోడీబీ ర్యాంకుల విధానం ప్రారంభంకాగా తొలిసారి 13వ స్థానంలో నిలిచిన తెలంగాణ 2017లో రెండు, 2019లో మూడోస్థానంలో నిలిచింది. కాగా, ఈవోడీబీ ర్యాంకింగ్‌లో తెలంగాణకు టాప్‌ అఛీవర్స్‌ జాబితాలో చోటుదక్కడంపై పరిశ్రమల మంత్రి కేటీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణలో సులభతర వాణిజ్యంతో ప్రశాంత వాణిజ్యం కూడా సాధ్యమని ట్వీట్‌ చేశారు. 

Also read: ISRO: 2023 ప్రథమార్థంలో గగన్‌యాన్‌–1 ప్రయోగం

ఆంధ్రప్రదేశ్‌ టాప్‌..
వరుసగా రెండవ ఏడాది పూర్తిగా సంస్కరణల ప్రయో జనాలు పొందిన వ్యాపారవేత్తల నుంచి తీసుకున్న అభిప్రాయాల ఆధారంగా ఈవోడీబీ ర్యాంకుల్లో ఏపీ అగ్రస్థానాన్ని సాధించింది. దీంతో వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం పరిశ్రమలకు అందిస్తున్న తోడ్పాటుకు ప్రపంచస్థాయిలో మరోసారి గుర్తింపు లభించింది. సర్వేలో 92 శాతం మార్కులు దాటిన ఏడు రాష్ట్రాలను టాప్‌ అచీవర్స్‌గా ప్రకటించగా, ఇందులో ఆంధ్రప్రదేశ్‌ 97.89%తో మొదటిస్థానంలో నిలిచింది.  


BOSCH India: ‘బాష్‌’ స్పార్క్‌ నెక్ట్స్‌’క్యాంపస్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ

భారత్‌కు బాష్‌ కంపెనీ ఎప్పుడో జర్మనీ నుంచి వచ్చినా ఇప్పుడు అది పూర్తిగా భారతీయతను సంతరించుకుందని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. ఆటోమొబైల్‌ విడిభాగాలు మొదలుకొని సెక్యూరిటీ, గృహోపకరణాలు తయారు చేసే బాష్‌ కంపెనీ దేశంలో కార్యకలాపాలు ప్రారంభించి వందేళ్లయింది. ఈ సందర్భంగా జూన్ 30న బాష్‌ బెంగళూరులో ‘స్పార్క్‌ నెక్ట్స్‌‘ పేరుతో నిర్మించిన భవనాన్ని ప్రధాని ఆవిష్కరించారు. వర్చువల్‌ పద్ధతిలో జరిగిన ఈ ఆవిష్కరణలో ప్రధాని మాట్లాడుతూ భారతీయ శక్తి, జర్మన్‌ ఇంజినీరింగ్‌ల సమర్థ మేళవింపునకు బాష్‌ కంపెనీ మంచి ఉదాహరణ అని ప్రశంసించారు. భారత స్వాతంత్య్ర అమృతోత్సవాలు జరుగుతున్న సమయంలో బాష్‌ వందేళ్లు పూర్తి చేసుకోవడం ఈ ఉత్సవాలకు ఒక ప్రత్యేకతను కల్పిస్తోందని చెప్పారు. దేశంలోని ప్రతి గ్రామానికీ హై స్పీడ్‌ ఇంటర్నెట్‌ సౌకర్యం కల్పించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని వెల్లడించారు. 

Also read: High Court: ఐదుగురు న్యాయమూర్తులకు చీఫ్‌ జస్టిస్‌లుగా పదోన్నతి

PSLV-C53 ప్రయోగం విజయవంతం

భారత అంతరిక్ష పరిశోధనాసంస్థ (ఇస్రో) తిరుపతి జిల్లా సతీస్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌)లోని రెండో  ప్రయోగవేదిక నుంచి పీఎస్‌ఎల్‌వీ సీ53 ఉపగ్రహ వాహకను జూన్ 30న సాయంత్రం 6.02 గంటలకు విజయవంతంగా ప్రయోగించారు. షార్‌ కేంద్రం నుంచి 81వ ప్రయోగాన్ని, పీఎస్‌ఎల్‌వీ సిరీస్‌లో 55వ ప్రయోగాన్ని  నిర్వహించి ఇస్రో శాస్త్రవేత్తలు తమ విజయ విహారాన్ని కొనసాగించారు. నాలుగుదశల ప్రయాణాన్ని విజయవంతంగా సాగిస్తూ 19.36 నిమిషాల వ్యవధిలో 522.8 కేజీల కిలోలు బరువున్న మూడు ఉపగ్రహాలను భూమికి 570 కిలోమీటర్లు ఎత్తులోని సన్‌ సింక్రనస్‌ ఆర్బిట్‌లోకి  ప్రవేశపెట్టారు. న్యూ స్పేస్‌ ఇండియా లిమిటెడ్‌ ఆధ్వర్యంలో వాణిజ్యపరమైన ప్రయోగాలే లక్ష్యంగా పెట్టుకున్నామని ఇస్రో ఛైర్మన్‌ ఎస్‌ సోమనాథ్‌ తెలిపారు.  

Also read: ISRO: 2023 ప్రథమార్థంలో గగన్‌యాన్‌–1 ప్రయోగం

GSTకి ఐదేళ్లు పూర్తి 

వాణిజ్య పన్నుల ఎగవేతలకు నివారించడం, దేశవ్యాప్తంగా ఒకటే పన్ను విధానం ఉండాలన్న లక్ష్యాలతో వచ్చిందే వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ)చట్టం. దేశ చరిత్రలో అతిపెద్ద పన్ను సంస్కరణ అయిన జీఎస్‌టీ 2017 జూలై 1న అమల్లోకి రాగా, ఈ ఏడాది జూన్‌ 30తో ఐదేళ్లు పూర్తి చేసుకుంది. ఈ కాలంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్న నూతన పన్ను వ్యవస్థ అనుకున్న లక్ష్యం దిశగా నిదానంగా అడుగులు వేస్తోంది. గతంతో పోలిస్తే పన్ను ఎగవేతలు తగ్గాయి. టెక్నాలజీ సాయంతో ఎగవేతలను గుర్తించడం యంత్రాంగానికి సాధ్యపడుతోంది. ప్రతీ నెలా పన్నుల రూపంలో వచ్చే ఆదాయం సగటున రూ.1.3 లక్షల కోట్లపైనే ఉంటోంది. 17 రకాల పన్నులు, పలు సెస్సుల స్థానంలో వచ్చిందే జీఎస్‌టీ. ఇందులో 5, 12, 18, 28 రేట్ల శ్లాబులు ప్రస్తుతం అమల్లో ఉన్నాయి. వీటికి భిన్నంగా బంగారం ఒక్కదానిపై 3 శాతం రేటు అమలవుతోంది. గతంలో అయితే అన్నింటిపైనా వినియోగదారుల చెల్లించే సగటు పన్ను సుమారు 31 శాతంగా ఉండేది. లగర్జీ వస్తువులు, ఆరోగ్యానికి, పర్యావరణానికి హాని కలిగించే వాటిపై జీఎస్‌టీ కింద అదనంగా సెస్సు అమల్లో ఉంది. ఈ రూపంలో వచ్చిన మొత్తాన్ని ప్రత్యేకంగా పరిహార నిధి పేరుతో కేంద్రం నిర్వహిస్తోంది. జీఎస్‌టీ కారణంగా పన్ను ఆదాయాన్ని కోల్పోయిన రాష్ట్రాలకు ఈ సెస్సు నిధి నుంచి పరిహారాన్ని కేంద్రం చెల్లిస్తోంది. 2022 ఏప్రిల్‌ నెలకు వసూలైన రూ.1.68 లక్షల కోట్లు.. జీఎస్‌టీ చరిత్రలో గరిష్ట నెలవారీ పన్నుల ఆదాయంగా ఉంది. జీఎస్‌టీ కింద మొదటిసారి రూ.లక్ష కోట్ల పన్ను ఆదాయం 2018 ఏప్రిల్‌ నెలకు నమోదైంది. కరోనా కారణంగా 2020 ఏప్రిల్, మే నెలలకు పన్ను ఆదాయం గణనీయంగా పడిపోవడం గమనార్హం.  

Also read: Mahaveer Chakra కల్నల్‌ సంతోష్‌బాబు సతీమణికి రూ.1.25 కోట్ల నగదు పురస్కారం

Udyami Bharat కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ

చిన్న వ్యాపార సంస్థలు, ఎంఎస్‌ఎంఈలు మరిన్ని ఎగుమతులు చేసేందుకు వీలుగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఎంఎస్‌ఎంఈ రంగం తన సామర్థ్యం మేరకు ఎగుమతులు చేసేందుకు నూతన విధానాలను రూపొందిస్తున్నట్టు చెప్పారు. జూన్ 30న ‘ఉద్యమి భారత్‌’ కార్యక్రమం ప్రారంభించిన సందర్భంగా ప్రధాని మోదీ, ఎంఎస్‌ఎంఈ రంగానికి పలు చర్యలను ప్రకటించారు. భారత దేశ ఎగుమతులు పెరిగేందుకు, మరిన్ని మార్కెట్లకు భారత ఉత్పత్తులు చేరుకునేందుకు ఎంఎస్‌ఎంఈ రంగం బలంగా ఉండడం అవసరమని చెప్పారు. ‘‘మీ సామర్థ్యాలు, అవకాశాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోంది. కొత్త విధానాలను రూపొందిస్తోంది. ఇవన్నీ ఎంఎస్‌ఎంఈలను ప్రోత్సహించడం, వాటి నాణ్యతను పెంచడం కోసమే. భారత ఎంఎస్‌ఎంఈల ఎగుమతులు పెంచాలి. ఈ దిశగా పనిచేయాలని విదేశాల్లోని భారత రాయబార కార్యాలయాలకు చెప్పాం. భారత మిషన్స్‌.. వాణిజ్యం, టెక్నాలజీ, టూరిజం అనే మూడు అంశాల ఆధారంగా పనిచేస్తుంది’’అని ప్రధాని వివరించారు. 

రుణాలకు సమస్యలు.. 
గ్యారంటీలు లేకుండా రుణాలు పొందలేని విషయాన్ని ప్రధాని ప్రస్తావించారు. ఇది సంస్థలను స్థాపించాలని భావించే బలహీన వర్గాల ఆకాంక్షలకు అతిపెద్ద అవరోధంగా పేర్కొన్నారు. అందుకనే తాము ప్రధానమంత్రి ముద్రా యోజన పథకాన్ని తీసుకొచి్చనట్టు చెప్పారు. దీని కింద ప్రతి భారతీయుడు సులభంగా వ్యాపారం ప్రారంభించొచ్చన్నారు. ఈ పథకం కింద ఇప్పటికే రూ.19 లక్షల కోట్ల రుణాలు మంజూరు చేసిన విషయాన్ని ప్రస్తావించారు. ఇలా రుణ సాయాన్ని పొందిన వారి నుంచి ఏడు కోట్ల మంది మొదటిసారి వ్యాపారులుగా మారినట్టు వివరించారు. ముద్రాయోజన కింద 36 కోట్ల రుణ ఖాతాలను మంజూరు చేయగా, అందులో 70% మహిళలకు ఇచి్చనవే ఉన్నాయని చెప్పారు. ఎంఎస్‌ఎంఈల పనితీరును పెంచే పథకం ‘ఆర్‌ఏఎంపీ’, మొదటిసారి ఎగుమతి చేసే ఎంఎస్‌ఎంఈల సామర్థ్య నిర్మాణం కోసం ‘సీబీఎఫ్‌టీఈ’ పథకాలను ప్రధాని ప్రారంభించారు.

Published date : 01 Jul 2022 05:52PM

Photo Stories