Skip to main content

Daily Current Affairs in Telugu: 2022, జూన్‌ 06 కరెంట్‌ అఫైర్స్‌

Current Affairs in Telugu June 6th 2022(డైలీ కరెంట్‌ అఫైర్స్‌ తెలుగులో): Current Affairs for All Competitive Exams In Telugu. Latest Articles useful for TSPSC &APPSC Group-1,2,3, 4, SSC, Bank, SI, Constable and all other competitive examinations
telugu current affairs june 6

FIH హాకీ 5s ఛాంపియన్‌షిప్ విజేత భారత్: హాకీ ఫైవ్స్‌ విజేత భారత్‌

hockey 5s

లుసానే: అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్‌) హాకీ ఫైవ్స్‌ టోర్నమెంట్‌లో  (ఒక్కో జట్టులో ఐదుగురు చొప్పున ఆడతారు) భారత పురుషుల జట్టు విజేతగా నిలిచింది. ఐదు జట్ల మధ్య జరిగిన ఈ టోర్నీలో భారత్‌ అజేయంగా నిలిచింది.  పోలాండ్‌ జట్టుతో ఆదివారం హోరాహోరీగా జరిగిన ఫైనల్లో భారత్‌ 6–4 గోల్స్‌ తేడాతో గెలిచింది. భారత్‌ తరఫున సంజయ్, గురీందర్‌ సింగ్‌ ఒక్కో గోల్‌ చేయగా... ధమి బాబీ సింగ్, రాహీల్‌ మొహమ్మద్‌ రెండేసి గోల్స్‌ సాధించారు. 

Download Current Affairs PDFs Here

International gold for Aman : భారత రెజ్లర్‌ అమన్‌ 57 కేజీల విభాగంలో స్వర్ణం

aman - wrestler

కజకిస్తాన్‌లో జరిగిన యునైటెడ్‌ వరల్డ్‌ రెజ్లింగ్‌ ర్యాంకింగ్‌ సిరీస్‌ టోర్నమెంట్‌లో భారత రెజ్లర్‌ అమన్‌ 57 కేజీల విభాగంలో స్వర్ణం సాధించాడు. ఫైనల్లో అమన్‌ 10–9తో మెరెయ్‌ బజర్బయెవ్‌ (కజకిస్తాన్‌)ను ఓడించాడు. టోక్యో ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత బజరంగ్‌ పూనియా (65 కేజీలు) కాంస్యంతో సరిపెట్టుకున్నాడు. కాంస్య పతక పోరులో బజరంగ్‌ 7–0తో రిఫత్‌ సైబొతలొవ్‌ (కజకిస్తాన్‌)పై గెలుపొందాడు. ఈ ఈవెంట్‌లో భారత్‌ 12 పతకాలు గెలుపొందగా, మహిళా రెజ్లర్లే 5 స్వర్ణాలు సహా 8 పతకాలు గెలిచారు.  

14వసారి ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిల్‌ నెగ్గిన రాఫెల్‌ నాదల్‌

పారిస్‌: మట్టికోటలో మహరాజు... నభూతో నభవిష్యత్‌... సరిలేరు నీకెవ్వరు... నమో నమః... ‘గ్రాండ్‌ సలాం’.. ఇంకా ఏమైనా విశేషణాలు ఉన్నాయంటే వాటిని కూడా స్పెయిన్‌ టెన్నిస్‌ స్టార్‌ రాఫెల్‌ నాదల్‌కు జత చేయాల్సిందే. ఒకవైపు తమ కెరీర్‌ మొత్తంలో ఒక్క గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ ఆడకుండానే.. గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ నెగ్గకుండానే కెరీర్‌ను ముగించేసిన టెన్నిస్‌ ఆటగాళ్లెందరో ఉంటే... మరోవైపు నాదల్‌ మాత్రం ఒకే గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ టైటిల్‌ను ఒకసారి కాదు... రెండుసార్లు కాదు... మూడుసార్లు కాదు... ఏకంగా 14సార్లు గెలిచి అందరిచేతా ప్రశంసలు అందుకుంటున్నాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ టైటిల్‌ నెగ్గి అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ టైటిల్స్‌ నెగ్గిన ప్లేయర్‌గా చరిత్ర సృష్టించిన రాఫెల్‌ నాదల్‌ జూన్‌  5 (ఆదివారం) ఈ జాబితాలో మరింత ఎత్తుకు ఎదిగిపోయాడు. ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్‌ కాస్పర్‌ రూడ్‌ (నార్వే)తో జరిగిన ఫ్రెంచ్‌ ఓపెన్‌ పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో ప్రపంచ ఐదో ర్యాంకర్‌ నాదల్‌ 2 గంటల 18 నిమిషాల్లో 6–3, 6–3, 6–0తో గెలిచాడు. తద్వారా ఫ్రెంచ్‌ ఓపెన్‌ను 14వసారి సొంతం చేసుకోవడంతోపాటు తన ఖాతాలో 22వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ను జమ చేసుకున్నాడు. ఫ్రెంచ్‌ ఓపెన్‌లో ఫైనల్‌ చేరిన 14 సార్లూ నాదలే గెలిచాడు. విజేతగా నిలిచిన నాదల్‌కు 22 లక్షల యూరోలు (రూ. 18 కోట్ల 30 లక్షలు)... రన్నరప్‌ రూడ్‌కు 11 లక్షల యూరోలు (రూ. 9 కోట్ల 15 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. 

ఏకపక్షంగా... 

ఫైనల్‌ చేరే క్రమంలో ప్రిక్వార్టర్‌ ఫైనల్లో తొమ్మిదో సీడ్‌ అలియాసిమ్‌ (కెనడా)పై, క్వార్టర్‌ ఫైనల్లో డిఫెండింగ్‌ చాంపియన్, వరల్డ్‌ నంబర్‌వన్‌ జొకోవిచ్‌ (సెర్బియా)పై, సెమీఫైనల్లో మూడో సీడ్‌ జ్వెరెవ్‌ (జర్మనీ)పై గెలిచిన నాదల్‌కు ఫైనల్లో ఎలాంటి ప్రతిఘటన ఎదురుకాలేదు. ఆరంభం నుంచే అద్భుతంగా ఆడిన నాదల్‌ తన ప్రత్యర్థికి ఏదశలోనూ పుంజుకునే అవకాశం ఇవ్వలేదు. ఎనిమిదిసార్లు రూడ్‌ సర్వీస్‌ను బ్రేక్‌ చేసిన నాదల్‌ తన సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయాడు. 37 విన్నర్స్‌ కొట్టిన నాదల్‌ కేవలం 18 అనవసర తప్పిదాలు చేశాడు. మరోవైపు రూడ్‌ 16 విన్నర్స్‌ కొట్టి, 26 అనవసర తప్పిదాలు చేశాడు.  

  • 1 ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిల్‌ నెగ్గిన పెద్ద వయస్కుడిగా  నాదల్‌ (36 ఏళ్ల 2 రోజులు) రికార్డు సృష్టించాడు. ఇప్పటిదాకా ఈ రికార్డు ఆండ్రెస్‌ గిమెనో (స్పెయిన్‌; 1972లో 34 ఏళ్ల 10 నెలలు) పేరిట ఉండేది.  
  • 8 నాదల్‌ 14 సార్లు ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిల్‌ నెగ్గిన క్రమంలో ఎనిమిదిసార్లు వేర్వేరు ప్రత్యర్థులపై గెలిచాడు. ఫైనల్స్‌లో ఫెడరర్‌పై నాలుగుసార్లు, జొకోవిచ్‌పై మూడుసార్లు, డొమినిక్‌ థీమ్‌పై రెండుసార్లు, సోడెర్లింగ్, పుయెర్టా, ఫెరర్, వావ్రింకా, కాస్పర్‌ రూడ్‌లపై ఒక్కోసారి విజయం సాధించాడు.  
  • 23 నాదల్‌ 14సార్లు ఫ్రెంచ్‌ ఓపెన్‌ విజేతగా నిలిచిన క్రమంలో తన ప్రత్యర్థులకు కోల్పోయిన మొత్తం సెట్‌ల సంఖ్య. 2008, 2010, 2017, 2020లలో అతను ఒక్క సెట్‌ కూడా ఓడిపోలేదు. 2007, 2012, 2018లలో ఒక్కో సెట్‌... 2014, 2019లలో రెండు సెట్‌లు... 2005, 2006, 2011, 2022లలో మూడు సెట్‌లు... 2013లో అత్యధికంగా నాలుగు సెట్‌లు చేజార్చుకున్నాడు.  
  • 112 ఫ్రెంచ్‌ ఓపెన్‌ టోర్నీ చరిత్రలో నాదల్‌ గెలిచిన మొత్తం మ్యాచ్‌లు.
  • 22 నాదల్‌ నెగ్గిన ఓవరాల్‌ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌. ఇందులో 14 ఫ్రెంచ్‌ ఓపెన్‌కాగా... 4 యూఎస్‌ ఓపెన్, 2 వింబుల్డన్, 2 ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ టైటిల్స్‌ ఉన్నాయి.

చ‌ద‌వండిః Daily Current Affairs in Telugu: 2022, జూన్‌ 4 కరెంట్‌ అఫైర్స్‌

Published date : 06 Jun 2022 05:56PM

Photo Stories