Skip to main content

Daily Current Affairs in Telugu: 2022, జూన్‌ 2 కరెంట్‌ అఫైర్స్‌

Current Affairs in Telugu June 2nd 2022(డైలీ కరెంట్‌ అఫైర్స్‌ తెలుగులో): Current Affairs for All Competitive Exams In Telugu. Latest Articles useful for TSPSC &APPSC Group-1,2,3, 4, SSC, Bank, SI, Constable and all other competitive examinations

Chief Minister YS Jagan launches ACB app: ఏసీబీ 14400 యాప్‌ను ప్రారంభిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

అవినీతికి ఏమాత్రం తావులేని స్వచ్ఛమైన పాలన అందించడమే మనందరి కర్తవ్యం కావాలని అధికార యంత్రాంగానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఎవరైనా సరే.. ఎక్కడైనా సరే.. అవినీతికి పాల్పడితే కచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చ రించారు. అవినీతిని నిరోధించేందుకు ఏసీబీ ప్రత్యేకంగా రూపొందించిన మొబైల్‌ యాప్‌ ‘ఏసీబీ 14400’ని ముఖ్యమంత్రి జగన్‌ జూన్‌ 1 (బుధవారం) తన క్యాంపు కార్యాలయంలో ‘స్పందన’ సమీక్ష సందర్భంగా ఆవిష్కరించి మాట్లాడారు.

Chief Minister YS Jagan launches ACB 14400 app

డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి, ఏసీబీ డీఐజీలు అశోక్‌కుమార్, పీహెచ్‌డి రామకృష్ణ ఇందులో పాల్గొన్నారు. ఎక్కడా అవినీతి ఉండకూడదనే మాట ఈ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి చాలా గట్టిగా, స్పష్టంగా, పదేపదే చెబుతున్నామని సీఎం జగన్‌ పేర్కొన్నారు. వ్యవస్థ ప్రక్షాళన దిశగా అనేక కార్యక్రమాలు చేపట్టామని గుర్తు చేశారు. చరిత్రలో ఎప్పుడూలేని విధంగా, ఏ రాష్ట్రం లోనూ లేని విధంగా రూ.1.41 లక్షల కోట్లను ఎలాంటి అవినీతికి తావు లేకుండా, నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి అత్యంత పారదర్శ కంగా జమ చేశామని చెప్పారు. 

చ‌ద‌వండి: Quiz of The Day(June 01, 2022) >> ప్రపంచం మొత్తం విపత్తుల్లో భూకంపాల శాతం?

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

India finish third in the Asian Cup Hockey Tournament ; ఆసియా కప్‌ హాకీ టోర్నమెంట్‌లో భారత్‌కు మూడో స్థానం

ఆసియా కప్‌ హాకీ టోర్నమెంట్‌లో డిఫెం డింగ్‌ చాంపియన్‌ భారత్‌ ఈసారి కాంస్య పతకంతో సరిపెట్టుకుంది. మూడు, నాలుగు స్థానాల కోసం జూన్‌ 1 (బుధవారం) జరిగిన పోరులో భారత జట్టు 1–0తో జపాన్‌పై గెలిచింది. ఆట ఆరంభం నుంచే భారత ఆటగాళ్లు దాడులకు పదును పెట్టారు. దీంతో ఆట ఏడో నిమిషంలోనే బీరేంద్ర సేన ఖాతా తెరువగలిగింది.

Asian Cup Hockey Tournament 2022

ఉత్తమ్‌ సింగ్‌ ఇచ్చిన పాస్‌ను అందిపుచ్చుకున్న రాజ్‌కుమార్‌ పాల్‌ (7వ ని.లో) మెరుపు వేగంతో ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌లోకి పంపించాడు. దీంతో భారత్‌ 1–0తో ఆధిక్యంలో దూసుకెళ్లింది. ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని కాపాడుకొని విజయాన్ని దక్కించుకుంది. ఫైనల్లో కొరియా 2–1తో మలేసియాను ఓడించి ఐదోసారి టైటిల్‌ సాధించింది. కొరియా తరఫున మంజే జంగ్‌ (17వ ని.), వాంగ్‌ (52వ ని.) చెరో గోల్‌ చేయగా, మలేసియా జట్టుకు చొలన్‌ ఏకైక గోల్‌ (25వ ని.) అందించాడు.
చ‌ద‌వండి: Quiz of The Day(June 01, 2022) >> ప్రపంచం మొత్తం విపత్తుల్లో భూకంపాల శాతం?

PM meets world champion boxer Nikhat Zareen: ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన తెలంగాణ మహిళా బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌

ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన తెలంగాణ మహిళా బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌కు రాష్ట్ర ప్రభుత్వం సముచిత గుర్తింపు ఇచ్చింది. రూ.2 కోట్ల నగదు బహుమతిని ప్రకటించడంతో పాటు బంజారాహిల్స్‌ లేదా జూబ్లీహిల్స్‌లో నివాసయోగ్య మైన ఇంటి స్థలం కేటాయించాలని నిర్ణయించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం జూన్‌  1 (బుధవారం) ఒక ప్రకటన విడుదల చేసింది.రాష్ట్ర ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన తెలంగాణ బిడ్డలను సమున్నతంగా గౌరవించుకోవాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించినట్టు పేర్కొంది. ఇటీవల టర్కీలో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో 52 కేజీల విభాగంలో నిఖత్‌ విజేతగా నిలిచింది. 

Boxer Nikhat Zareen won a gold medal in the Women’s World Boxing Championships

ఇషా సింగ్‌కు కూడా..
అంతర్జాతీయ షూటర్‌ ఇషా సింగ్‌కు కూడా ఇదే తరహాలో  ప్రభుత్వం నజరానాను ప్రకటించింది. రూ.2 కోట్ల నగదుతో పాటు ఇంటి స్థలం ఇవ్వనుంది. ఇటీవల జర్మనీలో జరిగిన జూనియర్‌ ప్రపంచకప్‌ టోర్నీలో ఇషా టీమ్‌ ఈవెంట్లలో 3 స్వర్ణ పతకాలు గెల్చుకుంది. 

మొగిలయ్యకు రూ.కోటి నగదు బహుమతి

పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్న కిన్నెరమెట్ల మొగిలయ్యకు రూ.కోటి నగదు పురస్కారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. సీఎం ఆదేశాలతోఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. మొగి లయ్య కోరిక మేరకు బీఎన్‌రెడ్డి నగర్‌ కాలనీలో నివాస యోగ్యమైన ఇంటి స్థలాన్ని కేటాయించాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. అంతరించిపో తున్న జానపద కిన్నెర వాయిద్య కళలో గొప్ప విద్వాంసుడిగా మొగిలయ్య కీర్తి గడించారు.   

ప్రధాని మోదీని కలిసిన నిఖత్‌

నిఖత్‌ జూన్‌  1 (బుధవారం) ప్రధాని నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకాలు సాధించిన మనీషా మౌన్‌ (57 కేజీలు), పర్వీన్‌ హుడా (63 కేజీలు) కూడా ప్రధానిని కలిశారు. ఈ సందర్భంగా మోదీ వారిని అభినందించారు. ‘ప్రధాని నరేంద్ర మోదీ సార్‌ను కలుసుకోవడం గొప్ప గౌరవంగా భావిస్తున్నా. థ్యాంక్యూ సార్‌’ అంటూ ప్రధానితో దిగిన ఫొటోను నిఖత్‌ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. 

Daily Current Affairs in Telugu: 2022, జూన్‌ 1 కరెంట్‌ అఫైర్స్‌

 

Published date : 02 Jun 2022 04:00PM

Photo Stories