Skip to main content

Daily Current Affairs in Telugu: 2022, జూన్‌ 28th కరెంట్‌ అఫైర్స్‌

Current Affairs in Telugu June 28th 2022(డైలీ కరెంట్‌ అఫైర్స్‌ తెలుగులో): Current Affairs for All Competitive Exams In Telugu. Latest Articles useful for TSPSC &APPSC Group-1,2,3, 4, SSC, Bank, SI, Constable and all other competitive examinations
Todays News Headlines and Highlights with GK in Telugu June 28th 2022
Todays News Headlines and Highlights with GK in Telugu June 28th 2022

Chagari Praveen Kumar: న్యాయసేవాధికార సంస్థ చైర్మన్‌గా జస్టిస్‌ ప్రవీణ్‌కుమార్‌

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా జస్టిస్‌ చాగరి ప్రవీణ్‌కుమార్‌ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఈ పదవికి జస్టిస్‌ ప్రవీణ్‌కుమార్‌ పేరును గవర్నర్‌ సూచించారు. హైకోర్టులో రెండో స్థానంలో ఉన్న సీనియర్‌ న్యాయమూర్తి న్యాయసేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. మొన్నటివరకు ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా ఉన్న జస్టిస్‌ అసనుద్దీన్‌ అమానుల్లా బదిలీపై వెళ్లారు. 

Also read: 14th Periodic Labour Force Survey: 14వ కార్మిక శక్తి సర్వే 

G7 Summit Germany: జీ7 సమ్మిట్ లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం 

g7 summit day 2


జర్మనీలో జరగుతున్న జీ 7 శిఖరాఖ్ర సదస్సులో పాల్గొన్న భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ... పర్యావరణ పరిరక్షణకు, తత్సంబంధిత వాగ్దానాలకు భారత్‌ పూర్తిగా కట్టుబడిందని  పునరుద్ఘాటించారు. ఈ విషయంలో కొన్నేళ్లుగా భారత్‌ కనబరుస్తున్న పనితీరే అందుకు నిదర్శనమన్నారు. వాతావరణ మార్పులపై పోరులో సంపన్న జీ7 దేశాలు కూడా భారత్‌తో కలిసి వస్తాయని ఆశాభావం వెలిబుచ్చారు. స్వచ్ఛ ఇంధన పరిజ్ఞానానికి సంబంధించి భారత్‌లో అందుబాటులో ఉన్న అపార అవకాశాలను అందిపుచ్చుకోవాలని వాటికి పిలుపునిచ్చారు. జూన్ 27న జీ7 శిఖరాగ్ర సదస్సులో వాతావరణ మార్పులు, ఇంధనం తదితరాలపై జరిగిన భేటీలో మాట్లాడారు. ఇంధన సామర్థ్యంలో 40 శాతాన్ని శిలాజేతర వనరుల నుంచి సమకూర్చుకోవాలన్న లక్ష్యాన్ని గడువుకు 9 ఏళ్ల ముందే సాధించామన్నారు. 

Also read: Chagari Praveen Kumar: న్యాయసేవాధికార సంస్థ చైర్మన్‌గా జస్టిస్‌ ప్రవీణ్‌కుమార్‌

‘‘ప్రపంచ జనాభాలో 17 శాతానికి భారత్‌ నిలయం. కానీ ప్రపంచ కర్బన ఉద్గారాల్లో దేశ వాటా కేవలం 5 శాతం. ప్రకృతితో కలిసి సాగే మా జీవన విధానమే ఇందుకు ప్రధాన కారణం’’ అని మోదీ అన్నారు. 

Also read: Infectious Diseases: అంటు వ్యాధులపై పోరుకు అమెరికా నిధులు

అంతకముందు... ఆల్ఫ్స్‌ పర్వత శ్రేణిలో జీ7 వేదికైన ఎల్మౌలో జర్మనీ చాన్సలర్‌ ఒలాఫ్‌ స్కోల్జ్‌ మోదీకి ఘనస్వాగతం పలికారు. అనంతరం అధినేతల ఫొటో సెషన్‌ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ మోదీ వద్దకు స్వయంగా వచ్చి కాసేపు ఆప్యాయంగా మాట్లాడారు. ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌ తదితరులు కూడా మోదీతో సుదీర్ఘంగా మంతనాలు జరుపుతూ కనిపించారు. కెనడా పీఎం జస్టిన్‌ ట్రూడో, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్‌ రామాఫోసా, ఇండోనేసియా అధ్యక్షుడు జోకో విడొడొ తదితరులతో మోదీ భేటీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. సదస్సులో జి7 దేశాలైన అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్, యూకే, ఇటలీ, కెనడా, జపాన్‌తో పాటు అతిథులుగా భారత్, ఇండొనేసియా, దక్షిణాఫ్రికా, సెనెగల్, అర్జెంటీనా దేశాధినేతలు పాల్గొన్నారు. 

Also read: Infectious Diseases: అంటు వ్యాధులపై పోరుకు అమెరికా నిధులు 

ఉక్రెయిన్‌కు జీ7 బాసట 

g7 summit modi

రష్యాపై పోరులో ఉక్రెయిన్‌కు అండగా నిలుస్తామని జర్మనీలోని ఎల్మౌలో జరుగుతున్న జి7 సదస్సు వేదికగా సభ్య దేశాధినేతలు ప్రతినబూనారు. యుద్ధం కాలంలో, తర్వాత కూడా మద్దతిస్తూనే ఉంటామన్నారు. రష్యాపై మరిన్ని కఠిన ఆంక్షలు విధిస్తామన్నారు. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సదస్సునుద్దేశించి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. యుద్ధం ఇప్పట్లో ఆగేలా లేనందున తమకు సాయంపై పశ్చిమ దేశాలు వెనుకంజ వేస్తాయేమోనని ఆందోళన వ్యక్తం చేశారు. దాన్ని జి7 దేశాధినేతలు కొట్టిపారేశారు. రష్యా నుంచి దిగుమతులపై సుంకాలను భారీగా పెంచాలని నిర్ణయించారు.

also read:G7 Summit Germany: జీ7 సమ్మిట్ లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం

ఉక్రెయిన్‌కు నానామ్స్‌ సిస్టమ్‌ 
అత్యాధునిక యాంటీ–ఎయిర్‌క్రాఫ్ట్‌ సిస్టమ్స్‌ ‘నాసమ్స్‌’ను ఉక్రెయిన్‌ అందించాలని అమెరికా నిర్ణయించింది. కౌంటర్‌–బ్యాటరీ రాడార్లు కూడా ఇవ్వనుంది. 7.5 బిలియన్‌ డాలర్ల ఆర్థిక సాయమూ అందజేస్తామని బైడెన్‌ ప్రకటించారు. ఉక్రెయిన్‌ పునర్నిర్మాణానికి జి7 సహకారం కొనసాగిస్తూనే ఉండాలని బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ అన్నారు.  

Also read: Infectious Diseases: అంటు వ్యాధులపై పోరుకు అమెరికా నిధులు

Solar Farm అంతరిక్షంలో చైనా సౌర విద్యుత్‌ కేంద్రం

సూర్యకిరణాలను అంతరిక్షంలోనే ఒడిసిపట్టాలని చైనా తలపోస్తోంది. ఇందుకోసం అంతరిక్షంలోనే సౌర విద్యుత్కేంద్రం నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇది మరో ఆరేళ్లలో పూర్తయ్యే అవకాశం ఉంది. ఈ సోలార్‌ స్పేస్‌ స్టేషన్‌లో విద్యుత్, మైక్రోవేవ్‌లను ఉత్పత్తి చేయనున్నారు. దీనిద్వారా కృత్రిమ ఉపగ్రహాల విద్యుత్‌ అవసరాలను తీర్చగా మిగిలే విద్యుత్‌ను కాంతి పుంజం (సోలార్‌ బీమ్‌) రూపంలో భూమిపైకి ప్రసరింపజేస్తారు. భూమిపై నిర్మించిన ప్రత్యేక కేంద్రాలు వాటిని ఒడిసిపట్టి కరెంట్‌ రూపంలో నిక్షిప్తం చేస్తాయట. వైర్‌లెస్‌ పవర్‌ ట్రాన్స్‌మిషన్‌ పద్ధతిలో ఈ ప్రక్రియ కొనసాగనుంది.

Also read: Space Rocket: అంతరిక్షంలోకి దక్షిణ కొరియా తొలి రాకెట్‌

Nitin Gadkari: 8 సీటర్‌ వాహనాల్లో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు తప్పనిసరి
 

air bags

దేశవ్యాప్తంగా ఏటా అయిదు లక్షల రోడ్డు ప్రమాదాల్లో సుమారు 1.5 లక్షల మంది మృత్యువాత పడుతున్నారని కేంద్ర రహదారి రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రయాణికులకు మరింత భద్రత కల్పించేలా ఎనిమిది సీట్ల మోటారు వాహనాల్లో కనీసం ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు తప్పనిసరిగా ఉండేలా నిబంధనలను ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. ఇంటెల్‌ ఇండియా సేఫ్టీ పయోనీర్స్‌ సదస్సులో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయం వెల్లడించారు. దీని కోసం ఆటోమొబైల్‌ రంగం సహా సంబంధిత వర్గాల అన్నింటి సహకారం కూడా కావాలని ఆయన పేర్కొన్నారు. కఠినతరమైన భద్రత, కాలుష్య ప్రమాణాల కారణంగా వాహనాల ఖరీదు పెరిగిపోతోందంటూ ఆటోమొబైల్‌ పరిశ్రమ ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో గడ్కరీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.  

Also read: GK Economy Quiz: US డాలర్‌తో పోలిస్తే భారతీయ రూపాయి ఆల్ టైమ్ కనిష్ట రికార్డు ఎంత?

CBDT(Central Board of Direct Taxes) చైర్మన్‌గా నితిన్‌ గుప్తా 
 

cbdt

ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డ్‌ (సీబీడీటీ) చైర్మన్‌గా ఇండియన్‌ రెవెన్యూ సర్వీసెస్ అధికారి నితిన్‌ గుప్తా నియమితులైనట్లు ప్రభుత్వం  తెలిపింది. ఆదాయపు పన్ను కేడర్‌కు చెందిన 1986 బ్యాచ్‌ ఐఆర్‌ఎస్‌ అధికారి గుప్తా, ప్రస్తుతం సీబీడీటీ బోర్డులో సభ్యుడిగా (విచారణ) పనిచేస్తున్నారు. ఆయన వచ్చే ఏడాది సెప్టెంబర్ లో పదవీ విరమణ చేయాల్సి ఉంది. గుప్తా నియామకానికి నియామకపు వ్యవహారాల కేబినెట్‌ కమిటీ ఆమోదముద్ర వేసిందని, బాధ్యతలు స్వీకరించిననాటి నుంచి ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని ప్రభుత్వ ఉత్తర్వులు తెలిపాయి. 

Also read: Chagari Praveen Kumar: న్యాయసేవాధికార సంస్థ చైర్మన్‌గా జస్టిస్‌ ప్రవీణ్‌కుమార్‌

జేబీ మహాపాత్ర ఏప్రిల్‌ 30న పదవీ విరమణ చేసిన తర్వాత సీబీడీటీ చీఫ్‌ పదవిని ప్రస్తుతం బోర్డు సభ్యురాలు,  1986–బ్యాచ్‌ ఐఆర్‌ఎస్‌ అధికారి సంగీతా సింగ్‌ అదనపు హోదాలో నిర్వహిస్తున్నారు. సీబీడీటీకి చైర్మన్‌ నేతృత్వం వహిస్తారు. ప్రత్యేక కార్యదర్శి హోదాలో ఆరుగురు సభ్యులు బాధ్యతలు నిర్వహించే వీలుంది. అయితే ప్రస్తుతం బోర్డ్‌లో ఐదుగురు సభ్యులు (నితిన్‌ గుప్తా, సంగీతా సింగ్‌సహా) ఉన్నారు. వీరిలో 1985 బ్యాచ్‌ ఐఆర్‌ఎస్‌ అధికారి అనూజా సారంగీ అత్యంత సీనియర్‌ అధికారి.  ఇతర సభ్యులు ప్రగ్యా సహాయ్‌ సక్సేనా, సుబశ్రీ అనంతకృష్ణన్‌ ఇరువురూ ఐఆర్‌ఎస్‌ 1987 బ్యాచ్‌కి చెందినవారు.

England vs New Zealand: న్యూజిలాండ్ తో టెస్ట్ సీరీస్ ని క్లీన్ స్వీప్ చేసిన ఇంగ్లండ్ 
 

England beat New Zealand to complete clean sweep

సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో ఇంగ్లండ్‌ సంపూర్ణ ఆధిక్యాన్ని ప్రదర్శించింది. జూన్ 27న ముగిసిన మూడో టెస్టులో ఇంగ్లండ్‌ 7 వికెట్ల తేడాతో కివీస్‌పై ఘన విజయం సాధించింది. ఫలితంగా 3 మ్యాచ్‌ల సిరీస్‌ను 3–0తో తమ ఖాతాలో వేసుకుంది. మ్యాచ్‌లో 10 వికెట్లు పడ గొట్టిన లీచ్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలవగా... ఇంగ్లండ్‌ తరఫున రూట్‌ (396 పరుగులు), న్యూజిలాండ్‌ తరఫున మిచెల్‌ (538 పరుగులు) ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అవార్డులు అందుకున్నారు.   

also read: CBDT(Central Board of Direct Taxes) చైర్మన్‌గా నితిన్‌ గుప్తా

Women's T20 శ్రీలంకతో T20 సీరీస్ నెగ్గిన భారత మహిళల జట్టు
 

Women's T20

శ్రీలంక వేదికగా ఆ జట్టుతో జరిగిన మహిళల టీ20 సీరీస్ ను భారత 2 - 1 తేడాతో కైవసం చేసుకుంది. మొదటి రెండు టీ20 లో విజయం సాధింటిన టీమిండియా, ఆఖరి మ్యాచ్ లో ఓడిపోయి  2–1తో సీరీస్ గెలుచుకుంది. ఎనిమిదేళ్ల తర్వాత టి20 మ్యాచ్‌లో భారత జట్టుపై శ్రీలంక గెలిచింది. చివరిసారి ఆ జట్టు 2014లో భారత్‌ను ఓ టి20 మ్యాచ్‌లో ఓడించింది. అంతేకాకుండా స్వదేశంలో భారత్‌పై శ్రీలంకకిదే తొలి విజయం కావడం విశేషం. 

Also read: GK Sports Quiz: 4వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఏ రాష్ట్రంలో జరగనున్నాయి?

శ్రీలంక పురుషులు, మహిళలకు సంబంధించిన టి20 చరిత్రలో 2000 పరుగుల మైలురాయిని చేరుకున్న తొలి క్రికెటర్‌ గా చమరి ఆటపట్టు రికార్డు సృష్టించింది. మాజీ క్రికెటర్‌ తిలకరత్నే దిల్షాన్‌ (1889; అత్యధిక టి20 స్కోరర్‌)ను ఆమె ఎప్పుడో దాటేసింది. 

 

Published date : 28 Jun 2022 06:37PM

Photo Stories