Skip to main content

థాయ్‌లాండ్ పర్యటనకు ప్రధాని మోదీ

ఆసియా దేశాల మధ్య పరస్పర సహకారం పెంపొందించే లక్ష్యంతో భారత ప్రధాని నరేంద్ర మోదీ మూడురోజుల థాయ్‌లాండ్ పర్యటనకు నవంబర్ 2న బయల్దేరారు.
ఈ పర్యటనలో భాగంగా థాయ్‌లాండ్ ప్రధాని ప్రయూత్ చాన్-ఓ-చాతో మోదీ సమావేశం కానున్నారు. నవంబర్ 3న జరగనున్న ఈ భేటీలో వాణిజ్యం, తీర ప్రాంతాల భద్రత, అనుసంధానం వంటి అంశాల్లో సహకారం పెంపు వంటి అంశాలపై ప్రయూత్, మోదీ చర్చలు జరపనున్నారు. మరోవైపు 14వ తూర్పు ఆసియా సదస్సు, ఆసియన్ ఇండియా సదస్సులో మోదీ పాల్గొననున్నారు. అలాగే గురునానక్ 550వ జయంతిని పురస్కరించుకుని ఏర్పాటు చేసే కార్యక్రమానికి హాజరవుతారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
థాయ్‌లాండ్ పర్యటనకు ప్రధాని మోదీ
ఎప్పుడు : నవంబర్ 2
ఎందుకు : ఆసియా దేశాల మధ్య పరస్పర సహకారం పెంపొందించే లక్ష్యంతో
Published date : 02 Nov 2019 06:20PM

Photo Stories