థాయ్‌లాండ్ ప్రధానితో మోదీ సమావేశం
Sakshi Education
థాయ్‌లాండ్ ప్రధాని ప్రయూత్ చాన్-ఓ-చాతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమయ్యారు.
థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో నవంబర్ 3న జరిగిన ఈ భేటీలో రక్షణ పరిశ్రమల రంగంలో ద్వైపాక్షిక సహకారాన్ని విసృ్తతం చేసుకునేందుకు మోదీ, ప్రయూత్ అంగీకరించారు. బ్యాంకాక్ నుంచి గువాహటికి నేరుగా విమాన సర్వీసులను ప్రారంభించాలని, థాయ్‌లాండ్‌లోని రణోంగ్ పోర్టుతో భారత్‌లోని కోల్‌కతా, చెన్నై, విశాఖ నౌకాశ్రయాల మధ్య అనుసంధానత పెంచాలని నిర్ణయించారు. వాణిజ్యం పెంపుపైనా ఇద్దరు నేతలు చర్చించారు. అనంతరం ఇండోనేసియా అధ్యక్షుడు జోకో విడోడోతో కూడా ప్రధాని మోదీ భేటీ అయ్యారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : థాయ్‌లాండ్ ప్రధాని ప్రయూత్ చాన్-ఓ-చాతో సమావేశం
ఎప్పుడు : నవంబర్ 3
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : బ్యాంకాక్, థాయ్‌లాండ్
క్విక్ రివ్యూ :
ఏమిటి : థాయ్‌లాండ్ ప్రధాని ప్రయూత్ చాన్-ఓ-చాతో సమావేశం
ఎప్పుడు : నవంబర్ 3
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : బ్యాంకాక్, థాయ్‌లాండ్
Published date : 04 Nov 2019 05:53PM