త్వరలో కొత్త వ్యూహాత్మక ఆయుధం : కిమ్
Sakshi Education
త్వరలో ఒక నూతన వ్యూహాత్మక ఆయుధాన్ని ప్రపంచానికి చూపనున్నామని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ వెల్లడించారు.
అణ్వాయుధ, ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి పరీక్షలు నిర్వహించకూడదంటూ విధించుకున్న స్వీయ నియంత్రణను మరెంతో కాలం కొనసాగించబోమని చెప్పారు. ఆర్థిక ప్రయోజనాల కోసం దేశ భద్రతను పణంగా పెట్టబోనని పేర్కొన్నారు. అధికార వర్కర్స్ పార్టీ సెంట్రల్ కమిటీ కీలక సమావేశాలు జరుగుతున్న సందర్భంలో కిమ్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. కిమ్ వ్యాఖ్యలను జనవరి 1న అధికార మీడియా ప్రచురించింది.
సాధారణంగా ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిస్సైల్(ఐసీబీఎం) వంటి అణ్వాయుధ సామర్థ్య ఆయుధ శ్రేణిని వ్యూహాత్మక ఆయుధంగా పరిగణిస్తారు.
మాదిరి ప్రశ్నలు
సాధారణంగా ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిస్సైల్(ఐసీబీఎం) వంటి అణ్వాయుధ సామర్థ్య ఆయుధ శ్రేణిని వ్యూహాత్మక ఆయుధంగా పరిగణిస్తారు.
మాదిరి ప్రశ్నలు
1. ఉత్తర కొరియా రాజధాని నగరం ఏదీ?
1. మాస్కో
2. సియోల్
3. టోక్యో
4. ప్యోంగ్యాంగ్
- View Answer
- సమాధానం: 4
2. ప్రస్తుతం దక్షిణ కొరియా అధ్యక్షుడిగా ఎవరు ఉన్నారు?
1. మూన్ జే-ఇన్
2. కిమ్ జోంగ్ ఉన్
3. షింజో అబే
4. వ్లాదిమిర్ పుతిన్
- View Answer
- సమాధానం: 1
Published date : 02 Jan 2020 06:15PM