త్వరలో భారత మార్కెట్‌లోకి ‘కియా కార్నివాల్’ కొత్త కారు
Sakshi Education
ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమల ఏర్పాటుకు అన్ని రకాలుగా సహాయ, సహకారాలను అందిస్తామని సీఎం వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు.
పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ ఎంతో అనువైన ప్రాంతమని, తమ ప్రభుత్వం చొరవ తీసుకుని క్రియాశీలకంగా వ్యవహరిస్తుందని చెప్పారు. అనంతపురం జిల్లా పెనుకొండ మండలం ఎర్రమంచిలోని కియా కార్ల తయారీ ప్లాంటు పూర్తిస్థాయిలో ఉత్పత్తి ప్రారంభించిన సందర్భంగా డిసెంబర్ 5న నిర్వహించిన ‘గ్రాండ్ ఓపెనింగ్’ కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఏటా 3 లక్షల కార్ల తయారీ సామర్థ్యం, రూ.13,500 కోట్ల పెట్టుబడితో కియా కార్ల తయారీ ప్లాంటు ఏర్పాటైంది.
ఏటా కార్ల ఉత్పత్తి సామర్థ్యం 70 వేల నుంచి 3 లక్షల వరకు..
కియా సంస్థ రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని ముఖ్యమంత్రి జగన్ ఆకాంక్షించారు. ప్రస్తుతం కియా ద్వారా నేరుగా 3 వేల మందికి, అనుబంధ కంపెనీల ద్వారా 3,500 మందికి ఉపాధి లభిస్తోందన్నారు. ఏటా కార్ల ఉత్పత్తి సామర్థ్యం 70 వేల నుంచి 3 లక్షలకు చేరడం వల్ల ప్రత్యక్షంగా 11 వేల మందికి, పరోక్షంగా 7 వేల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. ఏపీలో కియా సంస్థ పెట్టుబడులు పెట్టడం దేశానికే గర్వకారణమని, అన్ని విభాగాల్లో పూర్తిస్థాయిలో ఉత్పత్తి ప్రారంభం కావడం సంతోషకరమన్నారు. ఇందుకోసం కృషి చేసిన కియా సిబ్బందికి సీఎం అభినందనలు తెలిపారు.
ప్రభుత్వం నుంచి మంచి సహకారం: కియా గ్లోబల్ సీఈవో హన్
తమ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంచి సహకారం అందుతోందని కియా సంస్థ గ్లోబల్ సీఈవో హన్ ఊ పాక్ తెలిపారు. అత్యాధునిక సాంకేతిక నైపుణ్యంతో ఏర్పాటైన ఈ ప్లాంటు ప్రపంచస్థాయి కార్ల తయారీ యూనిట్ల సరసన నిలుస్తుందన్నారు. 2020 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఏటా 28 లక్షల కార్లను విక్రయించాలనేది తమ లక్ష్యమని, అనంతపురం యూనిట్ ఇందులో కీలకపాత్ర పోషిస్తుందని చెప్పారు. తమ సంస్థ నుంచి త్వరలో రానున్న ‘కియా కార్నివల్’ కారును భారతీయుల అవసరాలకు అనుగుణంగా ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: కియా కార్ల తయారీ ప్లాంటు పూర్తిస్థాయిలో ఉత్పత్తి ప్రారంభం
ఎప్పుడు: డిసెంబర్ 5, 2019
ఎవరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్
ఎక్కడ: అనంతపురం జిల్లా పెనుకొండ మండలం ఎర్రమంచి గ్రామం

Published date : 06 Dec 2019 06:12PM