ట్విట్టర్‌లో రాజకీయ ప్రచారం నిలిపివేత
Sakshi Education
ప్రపంచవ్యాప్తంగా ట్విట్టర్ వేదికపై రాజకీయ ప్రచారాన్ని నిలిపివేస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది.
సామాజిక మాధ్యమాల్లో రాజకీయ నేతలు తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ట్విట్టర్ ఈ నిర్ణయం తీసుకుంది. ఓటర్లను ప్రభావితం చేసేందుకు ట్విట్టర్‌ను వాడుకుంటే కోట్లాదిమందిపై ప్రభావం పడుతుందని ట్విట్టర్ సీఈవో జాక్ డోర్సీ అక్టోబర్ 31న పేర్కొన్నారు.
Published date : 01 Nov 2019 05:36PM