Skip to main content

తూర్పు నౌకాదళాధిపతిగా నియమితులైన వైస్‌ అడ్మిరల్‌?

తూర్పు నౌకాదళం(ఈఎన్‌సీ) అధిపతిగా వైస్‌ అడ్మిరల్‌ అజేంద్ర బహదూర్‌ సింగ్‌ నియమితులయ్యారు.
Current Affairs
నేవల్‌ డిఫెన్స్‌ అకాడమీలో విద్యనభ్యసించిన అజేంద్ర బహదూర్‌... 1983లో నౌకాదళంలో చేరారు. ప్రస్తుతం ఈఎన్‌సీ చీఫ్‌గా వ్యవహరిస్తున్న వైస్‌ అడ్మిరల్‌ అతుల్‌ కుమార్‌ జైన్‌ న్యూఢిల్లీలోని సీఐఎస్‌సీకి ఇంటిగ్రేటెడ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ చీఫ్‌గా బదిలీ అయ్యారు.

మయన్మార్‌ సైన్యం కాల్పుల్లో 18 మంది మృతి
మయన్మార్‌లో సైనిక పాలనకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 28న దేశంలో శాంతియుతంగా ఆందోళన జరుపుతున్న వారిపై సైన్యం జరిపిన కాల్పుల్లో 18 మంది ప్రాణాలు కోల్పోగా 30 మంది గాయపడ్డారని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సంఘం ఆందోళన వ్యక్తం చేసింది.

మయన్మార్‌(బర్మా) రాజధాని: న్యేఫిడా(Naypyidaw)
మయన్మార్‌ కరెన్సీ: క్యాట్‌ (kyat)
మయన్మార్‌ అధికార భాష: బర్మీస్‌(Burmese)

క్విక్‌ రివ్యూ :
ఏమిటి : తూర్పు నౌకాదళం(ఈఎన్‌సీ) అధిపతిగా నియామకం
ఎప్పుడు : ఫిబ్రవరి 28
ఎవరు : వైస్‌ అడ్మిరల్‌ అజేంద్ర బహదూర్‌ సింగ్‌
ఎందుకు : ఈఎన్‌సీ చీఫ్‌గా ఉన్న వైస్‌ అడ్మిరల్‌ అతుల్‌ కుమార్‌ జైన్‌ బదిలీ కావడంతో
Published date : 01 Mar 2021 06:10PM

Photo Stories