తత్కాల్ టికెట్లతో రూ.25,392 కోట్లు ఆధాయం
Sakshi Education
న్యూఢిల్లీ: రైల్వేశాఖ ప్రవేశపెట్టిన తత్కాల్ టికెట్ల పద్ధతి రైల్వేల పంట పండిస్తోంది.
తత్కాల్ బుకింగ్‌ల ద్వారా గత నాలుగేళ్లలో తమకు రూ. 25,392 కోట్ల ఆదాయం వచ్చిందని ఒక సమాచార హక్కు కార్యకర్త అడిగిన ప్రశ్నకు సమాధానంగా రైల్వేశాఖ సమాధానమిచ్చింది. ఇందులో రూ. 21,530 కోట్ల ఆదాయం తత్కాల్ కోటా నుంచి రాగా, తత్కాల్ ప్రీమియం ద్వారా మరో 3,862 కోట్ల రూపాయల ఆదాయం ఆర్జించామని వెల్లడించింది. తత్కాల్ సేవల ద్వారా 2016-19 కాలానికి రైల్వేల ఆదాయం 62 శాతం పెరిగిందని తెలిపింది. రైల్వేశాఖ తత్కాల్ పద్ధతిని 1997లోనే ప్రవేశపెట్టినప్పటికీ, 2004లోనే దేశమంతా అమలు చేసింది. ఈ పద్ధతిలో రెండో తరగతి టికెటై్లతే టికెట్ ధరపై 10 శాతం, మిగతా తరగతులకు 30 శాతం అధిక ధర వసూలు చేస్తారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా 2,677 రైళ్లలో తత్కాల్ పద్ధతిలో టికెట్ బుకింగ్‌స జరుగుతున్నాయి. ఈ రైళ్లలో అందుబాటులో ఉన్న మొత్తం 11.57 లక్షల సీట్ల నుంచి 1.71 లక్షల సీట్లను తత్కాల్ టికెటింగ్ కోసం కేటాయించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: తత్కాల్ టికెట్లతోఇండియన్ రైల్వేకిరూ.25,392 కోట్లు ఆధాయం
ఎప్పుడు: గత నాలుగేళ్లలో
క్విక్ రివ్యూ:
ఏమిటి: తత్కాల్ టికెట్లతోఇండియన్ రైల్వేకిరూ.25,392 కోట్లు ఆధాయం
ఎప్పుడు: గత నాలుగేళ్లలో
Published date : 03 Sep 2019 06:25PM