Skip to main content

ట్రస్మా ఎడ్యుకేషన్ ఎక్స్‌పో ప్రారంభం

తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ (ట్రస్మా) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎడ్యుకేషన్ ఎక్స్ పో-2019 ప్రారంభమైంది.
Current Affairsహైదరాబాద్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో డిసెంబర్ 28న తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు ఈ ఎక్స్ పోను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పిల్లలకు నాణ్యమైన విద్యనందించడం ఎంత అవసరమో, విలువలతో కూడిన విద్యను అందించడం కూడా అంతే అవసరమని అభిప్రాయపడ్డారు.

మరోవైపు కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ (క్రెడాయ్) తెలంగాణ ఆధ్వర్యంలో డిసెంబర్ 28న హైదరాబాద్‌లో జరిగిన 2వ క్రియేట్ అవార్డ్స్-2019 ప్రదానోత్సవంలో హరీశ్‌రావు పాల్గొని మాట్లాడారు. విద్యుత్, నీటి వినియోగం ఎక్కువగా అవసరం లేని గ్రీన్ బిల్డింగ్‌‌స నిర్మాణాలపై డెవలపర్లు దృష్టి సారించాలన్నారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
టస్మా ఎడ్యుకేషన్ ఎక్స్ పో-2019ప్రారంభం
ఎప్పుడు : డిసెంబర్ 28
ఎవరు : తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు
ఎక్కడ : హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్, హైదరాబాద్‌లోని
Published date : 30 Dec 2019 06:00PM

Photo Stories