Skip to main content

టర్కీ, గ్రీస్‌ దేశాల్లో భారీ భూకంపం

టర్కీ, గ్రీస్‌ దేశాల్లో అక్టోబర్ 30న భారీ భూకంపం సంభవించింది. టర్కీ పశ్చిమ తీరం, గ్రీస్‌ ద్వీపం సామోస్‌ల మధ్య ఏజియన్‌ సముద్రంలో సంభవించిన పెను భూకంపం ధాటికి రెండు దేశాల్లోని తీర ప్రాంత నగరాలు, పట్టణాలు చిగురుటాకుల్లా వణికాయి.
Current Affairs
7.0 తీవ్రతతో వచ్చిన ఈ భూకంపం కారణంగా టర్కీలోని సెఫారిసర్‌లో స్వల్ప స్థాయిలో సునామీ వచ్చింది. భారీగా దూసుకొచ్చిన రాకాసి అలలు తీరప్రాంతాలను ముంచెత్తాయి. భూకంపం కారణంగా అక్టోబర్ 30 నాటికి టర్కీ, గ్రీస్‌ల్లో మొత్తం 14 మంది మరణించారు. భూకంపం ప్రభావం టర్కీలోని మూడో అతిపెద్ద నగరం ఇజ్మిర్‌ పట్టణంపై భారీగా పడింది.

బల్గేరియా వరకు...
సామోస్‌ ద్వీపానికి ఉత్తర, ఈశాన్య ఉత్తరంగా 13 కిలోమీటర్ల దూరంలో ఏజియన్‌ సముద్రంలో భూకంప కేంద్రాన్ని గుర్తించామని యూరోపియన్‌–మెడిటరేనియన్‌ సిస్మోలాజికల్‌ సెంటర్‌ ప్రకటించింది. భూకంప తీవ్రతను భూకంప లేఖినిపై ప్రాథమికంగా 6.9 గా నిర్ధారించింది. అయితే, అమెరికా జియోలాజికల్‌ సర్వే మాత్రం భూకంప తీవ్రతను 7.0 గా పేర్కొంది. 10 కిమీల లోతున భూకంపం సంభవించింది. భూకంప ప్రకంపనలు గ్రీస్‌ రాజధాని ఏథెన్స్‌తో పాటు బల్గేరియా వరకు విస్తరించాయి.

టర్కీ రాజధాని: అంకారా; కరెన్సీ: టర్కిస్లీరా
గ్రీస్ రాజధాని: ఏథెన్స్; కరెన్సీ: యూరో
Published date : 31 Oct 2020 05:48PM

Photo Stories