Skip to main content

త్రివిధ దళాల్లో పని చేసిన ఒకే ఒక్క భారతీయుడు?

త్రివిధ బలగాల్లో సేవలందించి ప్రత్యేకత చాటుకున్న ఒకే ఒక్క భారతీయుడు, రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న సాహసికుడు, ప్రీతిపాల్ సింగ్ గిల్ 100 ఏళ్ల పుట్టిన రోజు పండుగని కుటుంబ సభ్యుల మధ్య వేడుకగా జరుపుకున్నారు.
Current Affairsపంజాబ్‌లోని ఫరీద్‌కోట జిల్లా పాఖీ గ్రామానికి చెందిన ప్రీతిపాల్ కుటుంబం తరతరాల నుంచి సైన్యంలోనే పనిచేస్తోంది.

1920 డిసెంబర్ 11న పాటియాలాలో పుట్టిన ప్రీతిపాల్ సింగ్ 1942లో భారత వాయుసేనలో చేరారు. తర్వాత నేవీలో చేరారు. కార్గో నౌకలకు ఎస్కార్ట్‌గా రెండో ప్రపంచ యుద్ధంలో కూడా పాల్గొన్నారు. కొన్నేళ్ల తర్వాత ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో ఆర్మీకి బదిలీ అయ్యారు. గ్వాలియర్ మౌంటెన్ రెజిమెంట్‌లో సేవలు అందిస్తూ 1965లో పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధంలో పాల్గొన్నారు. మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్ సెక్టార్ కమాండర్‌గా పని చేస్తూ 1970లో రిటైర్ అయ్యారు. పదవీ విరమణ తర్వాత తన స్వగ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
Published date : 12 Dec 2020 05:45PM

Photo Stories