Skip to main content

ట్రీ సిటీ ఆఫ్‌ ది వరల్డ్‌ 2020గా గుర్తింపు పొందిన భారతీయ నగరం ఏది?

పట్టణంలో అడవులను పెంచడంతో పాటు వాటిని నిబద్ధతతో నిర్వహించినందును హైదరాబాద్‌ను ట్రీ సిటీ ఆఫ్‌ వరల్డ్‌ 2020గా ఐక్యరాజ్యసమితి ఆహార, వ్యవసాయ సంస్థ, అర్బోర్‌ డే ఫౌండేషన్‌ గుర్తించాయి.
Current Affairs
పట్టణ, పెరి–అర్బన్‌ ఫారెస్ట్రీ చర్యల అభివృద్ధి, ప్రాజెక్టులు, వ్యూహాత్మక ప్రణాళికతో ఆరోగ్యకరమైన నగరాన్ని నిర్మించడానికి నిబద్ధతతో చెట్లను నాటి, పెంచి పోషించిన కారణంగా ఈ గుర్తింపునిచ్చారు. ఈ జాబితాలోని నగరాల్లో ఎక్కువ భాగం యునైటెడ్‌ స్టేట్స్, యునైటెడ్‌ కింగ్‌డమ్, కెనడా, ఆస్ట్రేలియాలో ఉన్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో ఐఎస్‌వో గుర్తింపు దక్కిన తొలి టెక్నికల్‌ వర్సిటీ?
అనంతపురం జేఎన్‌టీయూకు ఐఎస్‌వో (ఇంటర్నేషనల్‌ ఆర్గనైజేషన్‌ ఫర్‌ స్టాండరై్డజేషన్‌) గుర్తింపు దక్కింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఐఎస్‌వో గుర్తింపు దక్కిన తొలి టెక్నికల్‌ వర్సిటీగా జేఎన్‌టీయూ (ఏ) రికార్డుకెక్కింది. మార్చి 3న వర్సిటీలో జరిగిన కార్యక్రమంలో ‘హైమ్‌’ ఇంటర్నేషనల్‌ సర్టిఫికేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ప్రతినిధి శివయ్య ఐఎస్‌వో సర్టిఫికెట్లను వర్సిటీ అధికారులకు అందజేశారు.
Published date : 03 Mar 2021 05:54PM

Photo Stories