టోక్యో యూనివర్సిటీతో జట్టు కట్టిన భారత ఐటీ సేవల దిగ్గజం?
Sakshi Education
పరిశ్రమపై సంయుక్తంగా అధ్యయనం చేసేందుకు టోక్యో యూనివర్సిటీతో (యూటోక్యో) చేతులు కలిపినట్లు ఐటీ సేవల దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) అక్టోబర్ 21న వెల్లడించింది.
వ్యాపార, సామాజిక సవాళ్లను డిజిటల్ టెక్నాలజీల ద్వారా అధిగమించే మార్గాలపై ఈ ఒప్పందం ద్వారా అధ్యయనం చేయనున్నారు. ఇది ఆధునిక సమాజం ఎదుర్కొంటున్న అనేక సవాళ్ల పరిష్కారానికే కాకుండా, భారత్-జపాన్ సంబంధాలను మరింత మెరుగుపర్చేందుకు, ఇరు దేశాల వృద్ధికి దోహదపడగలదని యూటోక్యో ప్రెసిడెంట్ మకొటో గొనొకమి తెలిపారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : టోక్యో యూనివర్సిటీతో జట్టు కట్టిన భారత ఐటీ సేవల దిగ్గజం
ఎప్పుడు : అక్టోబర్ 21
ఎవరు : టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)
ఎందుకు : వ్యాపార, సామాజిక సవాళ్లను డిజిటల్ టెక్నాలజీల ద్వారా అధిగమించే మార్గాలపై అధ్యయనం చేసేందుకు

Published date : 22 Oct 2020 06:01PM