Skip to main content

టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం నెగ్గిన భారత రెజ్లర్‌?

టోక్యో ఒలింపిక్స్‌–2020లో భారత స్టార్‌ రెజ్లర్‌ బజరంగ్‌ పూనియా కాంస్య పతకం సాధించాడు.
ఆగస్టు 7న జరిగిన పురుషుల ఫ్రీస్టయిల్‌ 65 కేజీల విభాగం కాంస్య పతక పోరులో బజరంగ్‌ 8–0తో దౌలత్‌ నియాజ్‌బెకోవ్‌ (కజకిస్తాన్‌)పై గెలిచి కాంస్యాన్ని చేజిక్కించుకున్నాడు. బజరంగ్‌కు వ్యక్తిగత కోచ్‌గా జార్జియాకు చెందిన షాకో బెంటినిడిస్‌ శిక్షణ ఇచ్చాడు. హరియాణ రాష్ట్రం జాజ్జర్‌ జిల్లా ఖుడాన్‌ గ్రామానికి చెందిన 27 ఏళ్ల బజరంగ్‌ తన కెరీర్‌లో ప్రపంచ చాంపియన్‌షిప్‌లో మూడు పతకాలు (రజతం, 2 కాంస్యాలు), ఆసియా చాంపియన్‌షిప్‌లో ఏడు పతకాలు (2 స్వర్ణాలు, 3 రజతాలు, 2 కాంస్యాలు), ఆసియా క్రీడల్లో రెండు పతకాలు (స్వర్ణం, రజతం), కామన్వెల్త్‌ గేమ్స్‌లో రెండు పతకాలు (స్వర్ణం, రజతం) సాధించాడు. ఒలింపిక్స్‌ కాంస్యం నెగ్గిన రెజ్లర్‌ బజరంగ్‌కు రూ.2 కోట్ల 50 లక్షల నగదు, ప్రభుత్వ ఉద్యోగం, నివాస స్థలం అందజేస్తామని హరియాణ ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ ప్రకటించారు.

క్విక్‌ రివ్యూ :

ఏమిటి : టోక్యో ఒలింపిక్స్‌–2020లో కాంస్య పతకం నెగ్గిన భారత రెజ్లర్‌?
ఎప్పుడు : ఆగస్టు 7
ఎవరు : భారత స్టార్‌ రెజ్లర్‌ బజరంగ్‌ పూనియా
ఎక్కడ : టోక్యో, జపాన్‌
ఎందుకు : పురుషుల ఫ్రీస్టయిల్‌ 65 కేజీల విభాగం కాంస్య పతక పోరులో బజరంగ్‌ 8–0తో దౌలత్‌ నియాజ్‌బెకోవ్‌ (కజకిస్తాన్‌)పై గెలిచినందున..
Published date : 09 Aug 2021 05:53PM

Photo Stories