టోక్యో ఒలింపిక్స్‌కు 29 మందితో శరణార్థుల జట్టు
Sakshi Education
ఆటల్లో సత్తా ఉన్నా... సొంత దేశం, జెండా లేని క్రీడాకారులు కూడా ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు వీలుగా అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) అవకాశం కల్పిస్తోన్న శరణార్ధుల జట్టు తరఫున... టోక్యో ఒలింపిక్స్-2021లో 29 మంది అథ్లెట్లు బరిలోకి దిగనున్నారు.
రెఫ్యూజీ ఒలింపిక్ టీమ్ (ఈఓఆర్) పేరుతో ఇలాంటి జట్టును ఐఓసీ అనుమతించడం ఇది వరుసగా రెండోసారి. రియో (2016) ఒలింపిక్స్‌తో పోలిస్తే (10 మంది) ఇప్పుడు ఈ సంఖ్య సుమారు మూడు రెట్లు పెరగడం విశేషం. స్వదేశంలో యుద్ధోన్మాదం, వివక్ష తదితర కారణాలతో పరాయి దేశానికి వెళ్లి వీరంతా అక్కడ శిక్షణ పొందారు. ఇలా వచ్చిన 55 మందిలోంచి ప్రదర్శన ఆధారణంగా 29 మందిని ఐఓసీ ఎంపిక చేసింది. 12 రకాల క్రీడాంశాల్లో పోటీ పడనున్న ఈ శరణార్ధులు అఫ్ఘానిస్తాన్, కామెరూన్, కాంగో, రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఎరిట్రియా, ఇరాన్, ఇరాక్, సౌత్ సుడాన్, సుడాన్, సిరియా, వెనిజులా (మొత్తం 11) దేశాలకు చెందినవారు.
Published date : 09 Jun 2021 07:39PM